New Central Govt Schemes 2024: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్.. 7.5 వడ్డీతో మహిలకు స్పెషల్ పథకం..
కేంద్ర పరిచయం చేసిన ఈ కొత్త పథకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ (Mahila Samman Savins Certificate Scheme).. ఈ పథకం ద్వారా భారత మహిళలు డబ్బులు జమ చేసుకుంటే భారీ మొత్తంలో వడ్డీ రేట్లు పొందే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో భాగంగా పెట్టుబడులు పెట్టిన వారిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు MP రాష్ట్రానికి సంబంధించిన 7,46,223 మంది మహిళలు లబ్ధిపొందినట్లు తెలుస్తోంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో భాగంగా ఇక్కసారి మాత్రమే పెట్టుబడి పెడితే చాలు.. దీని ద్వారా ప్రతి నెల గరిష్ఠంగా వడ్డీని పొందవచ్చు.
ఈ పథకంలో భాగంగా ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తోంది.
అలాగే ఈ పథకం నుంచి డబ్బులు తీసుకోవడం కూడా చాలా సులభం.. మెచ్యూరిటికి ముందే డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఈ పథకంలో భాగంగా డబ్బులను దాదాపు 2 సంవత్సరాల పాటు ఖాతాలో ఉంచాల్సి ఉంటుంది.
ఈ పథకంలో మైనర్ బాలికలికపై కూడా పెట్టుబడులు పెట్టుకునే సదుపాయాన్ని అందిస్తోంది. వారికి సంబంధించిన సంరక్షకులు మార్చి 31, 2025లోపు పెట్టుబడి పెట్టి ఖాతా తెరిస్తే.. మంచి వడ్డీని పొందుతారు.