Tollywood Industry: తెరపై దేవుళ్లు కనిపిస్తే బొమ్మ హిట్టేనా..? ఇండస్ట్రీలో ట్రెండ్ ఇదే..!

Thu, 18 Jul 2024-7:11 pm,

గత చరిత్రను చెబుతూ.. తెరపై దేవుడిని ఒక్కసారి అలా చూపించినా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ మోతమోగుతోంది.  

నందమూరి బాలయ్య అఖండ సినిమా, తేజ సజ్జా హనుమాన్, ప్రభాస్ కల్కి వంటి సినిమాలు ఏస్థాయిలో హిట్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  

దైవ భక్తిని చాటి చెబుతూ.. దేవుడి శక్తిని చూపించేలా కథ, కథనాలతో తెరకెక్కిస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందేనని సినీ పండితులు అంటున్నారు.  

అనసూయ ప్రధాన పాత్రలో నటించిన అరి సినిమా ఇదే ట్రెండ్‌లో సిద్ధం అవుతోంది. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది.   

ఈ సినిమాలో కృష్ణుడిదే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని రూపొందించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో కృష్ణుడ్ని చూపించే సీన్‌కు గూస్ బంప్స్ పక్కా అని తెలుస్తోంది.   

ఇక వచ్చే ఏడాది మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. జై హనుమాన్, నిఖిల్ స్యయంభు, కార్తికేయ 3లు కూడా దైవ భక్తి చుట్టే రూపొందుతున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link