New Year Horoscope: ఈ మూడు రాశులకు జనవరి 1 నుంచి మహర్జాతకం, ఊహించని సంపద
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు రేపట్నించి దశ మారనుంది. విద్యార్ధులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరగనున్నాయి. వ్యాపారులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఈ రాశి జాతకులకు రేపట్నించి అంతా అనుకున్నట్టే జరుగుతుంది
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అత్యద్బతమైందిగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ముఖ్యంగా రేపట్నించి అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. కెరీర్ బాగుంటుంది. వ్యాపారంలో అమితమైన లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తిరుగుండదు. ఊహించని సంపద చేతికి అందడంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఎలాంటి డబ్బు సమస్య ఉత్పన్నం కాదు. ఉద్యోగులకు పదోన్నతితో పాటు వేతనం పెరుగుతుంది
మిధున రాశి
మిధున రాశి జాతకులకు జనవరి 1 అంటే రేపట్నించి దశ మారనుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడమే కాకుండా ఆనందంగా ఉంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటంతో ఎలాంటి సమస్యలుండవు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి
హిందూ మతంలో జ్యోతిష్యం ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటాయి. దాంతో వివిథ రాశుల జాతకం మారుతుంటుంది. గ్రహాల కదలికను బట్టి జాతకం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశువారికి జనవరి 1 నుంచి అత్యద్బుతంగా ఉండనుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏ రంగంలో అడుగెట్టినా అమితమైన లాభాలు ఆర్జిస్తారు