Nissan X Trail SUV: టొయోటా ఫార్చ్యూనర్ పోటీగా నిస్సాన్ ఎక్స్ ట్రయల్, ధర ఫీచర్లు ఇలా
NISSAN X Trail SUV Price
నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ముందుగా బుక్ చేసుకుంటే డెలివరీ జరుగుతుంది. ఇప్పటికే 150 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మూడు రంగుల్లో లభ్యం కానుంది. భారతీయుల కోసం ప్రత్యేకంగా 7 సీటర్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఈ కారు టొయోటా ఫార్చ్యూనర్ కారుకు పోటీ ఇవ్వనుంది. ధర 49.92 లక్షలు ఉంటుంది.
NISSAN X Trail SUV Engine
ఇందులో 1.5 లీటర్ 3 సిలెండర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇది 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో అనుసంధానమై ఉంది. 161 బీహెచ్ పి పవర్, 300 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు.
NISSAN X Trail SUV Safety Features
ఇందులో సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ అమర్చింది కంపెనీ. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి.
NISSAN X Trail SUV Interior
ఇందులో ప్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ Infotainment సిస్టమ్ ఉంది. Digital Instrument Cluster, Dual Zone Climate Control, Panoramic Sunroof, Automatic Viper ఉన్నాయి. ఆటో హోల్డ్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ కన్సోల్ కప్ హోల్డర్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఉంది.
NiSSAN X Trail SUV Design
ఇండియాలో లాంచ్ చేసిన నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్ కలిగి ఉంది. ఇది 4వ జనరేషన్ మోస్ట్ లుక్రేటివ్ కారు. ముందు భాగంలో Split LED లైటింగ్, ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటే వెనుక భాగంలో ఎల్ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 20 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్, 2,705 మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉంటుంది. ఈ కారు పొడవు 4680 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 1840 మిల్లీమీటర్లు ఉంది. ఇక ఎత్తు 1725 మిల్లీమీటర్లుగా ఉంది.