NTR Political Spl: తెలుగునాట కాంగ్రెస్ పార్టీని ఢీ కొన్న మేరునగధీరుడు ఎన్టీఆర్.. సాధించిన ఘనతలు ఇవే..

Tue, 28 May 2024-7:10 am,

57 యేళ్ల వయసులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అన్నగారు.. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ స్థాపించారు. అంతేకాదు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించారు.

నటుడిగా ఉంటూ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన రెండో వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేసారు. ఆయన కంటే ముందు ఎమ్జీఆర్ ముందుగా సీఎం అయ్యారు.

కానీ పార్టీ పెట్టిన తక్కువ సమయంలోనే సీఎం అయిన రికార్డు ఎన్టీఆర్‌కు దక్కుతుంది.

1984 లోక్‌సభ ఎన్నికల్లో 35 ఎంపీ సీట్లును సాధించి రికార్డు క్రియేట్ చేసారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా పొందిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.. జనతా వస్త్రాలు..సంక్షేమ హాస్టళ్లు.. తెలంగాణ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 

1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్నడు ఊహించని సీట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తొలిసారి ఎన్నికల్లో 204 సీట్లను సాధించి సంచలనం సృష్టించారు.

ఆ తర్వాత లక్ష్మీ పార్వతిని బూచిగా చూపి కుటుంబ సభ్యుల సహాకారంతో చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు అందుకోవడంతో పాటు ఎన్టీఆర్ పదవీచ్యుడిని చేసి తాను ముఖ్యమంత్రి అయ్యారు.

1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్.. 1996 జనవరి 18న కన్నుమూసారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link