Ola Electric: ఓలా నుంచి అదిరిపోయే శుభవార్త.. రూ.39 వేలకే.. 112 కి.మీల మైలేజీ Gig ఎలక్ట్రిక్ బైక్..
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కంపెనీ ఈ స్కూటర్స్‌ను 'గిగ్'(Gig) సిరీస్‌లో విడుదల చేసింది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన బ్యాటరీలలో విడుదలయ్యాయి. ఈ స్కూటర్స్ ధర రూ.39 వేల నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
ఓలా విడుదల చేసిన 'గిగ్' సిరీస్‌లో రెండు వేరియంట్స్ ఉంటాయి. ఇందులో మొదటిది 'గిగ్' అయితే రెండవది 'గిగ్+' వేరియంట్ పేరుతో విడుదలైంది. ఇందులోని మొదటి వేరియంట్ రూ. 39,999 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక రెండవ వేరియంట్ రూ.49,999 (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ గిగ్ ఈ - స్కూటర్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 112 కి.మీల పరిధి మైలేజీ అందిస్తుంది. దీని గరిష్టంగా 25 కి.మీ/గం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ రెండు సిరీస్‌లు 1.5 kWh బ్యాటరీతో లాంచ్ అయినట్లు తెలుస్తోంది.
'గిగ్+'(Gig+) వేరియంట్ సింగిల్/డ్యూయల్ బ్యాటరీ (1.5 kWh)తో విడుదలైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మొదటి వేరియంట్ కంటే అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ - స్కూటర్స్ త్వరలోనే అన్ని ఓలా షో రూమ్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల సమయంలో కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.