Ola S1 Pro Vs Bajaj Chetak: ఓలా ఎస్‌ 1 ప్రో Vs బజాజ్‌ చెతక్‌.. ఈ రెండిటిలో బెస్ట్‌ బైక్‌ ఇదే!

Mon, 21 Oct 2024-5:36 pm,

ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా ఎస్‌ 1 ప్రో, బజాజ్‌ చెతక్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు స్కూటర్స్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో చాలా మంది వీటిల్లో ఏది కొనుగోలు చేయాలో తెలియక తికమక పడుతున్నారు.

ఓలా ఎస్‌ 1 ప్రో స్కూటర్‌ కంటే బజాజ్‌ చెతక్ బెస్టా? నిజానికి ఈ రెండు స్కూటర్స్‌లో ఏది బెస్టో.. వీటిల్లో ఏది ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ రెండు స్కూటర్స్‌కి సంబంధించిన డిజైన్‌ వివరాల్లోకి వెళితే.. ఓలా ఎస్‌ 1 ప్రో స్పోర్టీ డిజైన్‌తో చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫ్యూచరిస్టిక్ స్కూటర్‌గా మంచి పేరు సంపాదించింది. ఇక బజాజ్‌ చెతక్ క్లాసిక్ రెట్రో లుక్‌తో ఇది కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిని కంపెనీ నాస్టాల్జిక్ స్కూటర్‌ పేరుతో విడుదల చేసింది.

ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ రెండు స్కూటర్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయి. ఓలా ఎస్‌ 1 ప్రో స్కూటర్‌ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బజాజ్‌ చెతక్ సిటీ రైడింగ్‌కు అనువుగా ప్రీమియం పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.  

ఇక ఈ రెండు స్కూటర్స్‌ ఫీచర్స్‌ పరంగా చూస్తే.. ఇందులోని ఓలా ఎస్‌ 1 ప్రో స్కూటర్‌ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులోని టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు నావిగేషన్, కనెక్టివిటీలతో లభిస్తోంది. ఇక బజజ్‌ చెతక్ స్కూటర్‌ అనలాగ్ స్పీడోమీటర్, బేసిక్ డిస్‌ప్లేలను మాత్రమే కలిగి ఉంటుంది.  

బ్యాటరీ వివరాల్లోకి వెళితే..ఓలా ఎస్‌ 1 ప్రో స్కూటర్‌ అధిక కెపాసిటీ బ్యాటరీతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక బజజ్‌ చెతక్ మాత్రం తక్కువ కెపాసిటీ బ్యాటరీతో సాధారణ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. దీని బట్టి చూస్తే చాలా వరకు ఓలా ఎస్‌ 1 ప్రో చాలా బెటర్..  

ఓలా ఎస్‌ 1 ప్రో ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. కాబట్టి ధర పరంగా చూస్తే చెతక్‌ కంటే చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బజాజ్‌ చెతక్ తక్కువ ఫీచర్స్‌ కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటుంది.  

ఈ రెండింటిలో మంచి స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఓలా ఎస్‌ 1 ప్రో చాలా బెస్ట్‌గా చెప్పొచ్చు. ధర పరంగా చాలా ఎక్కువైనప్పటికీ ఈ స్కూటర్‌ చాలా బాగుంటుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link