Kriti Kharbanda: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Tue, 30 Jan 2024-5:14 pm,

Kriti Kharbanda‌ Engagement Photos:

తెలుగులో పద్దతిగా కనిపించిన ముద్దుగుమ్మల్లో కృతి కర్బంద కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా తీన్మార్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఆ తరువాత మనోజ్ హీరోగా చేసిన మిస్టర్ నూకయ్య, రామ్ హీరోగా చేసిన ఒంగోలు గిత్త లాంటి సినిమాలలో డీసెంట్ రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

ఈ హీరోయిన్ కి తెలుగులో అనుకున్న స్థాయిలో ఆఫర్లు అయితే రాలేదు. కాగా ఆ తరువాత హిందీ ఆఫర్లు అందుకోవటంతో తన దృష్టి బాలీవుడ్ వైపు తిప్పింది.

ప్రస్తుతం ఈ ఢిల్లీ బ్యూటీ.. తన ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి అందరిని అలరిచ్చింది. గత కొంతకాలంగా పుల్కిత్ సామ్రాట్‌తో కృతి కర్బంద ప్రేమలో ఉందనే వార్త వినిపిస్తూ వచ్చింది.

దానికి తగ్గట్టు వీరిద్దరి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ వచ్చాయి. కాగా ఇప్పుడు వారిద్దరి ప్రేమని అఫీషియల్ గా బయట పెట్టింది ఈ హీరోయిన్.

వీరిద్దరూ ఎంగేజ్మెంట్ తో ఒకటి కాగా ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు వీరే ది వెడ్డింగ్, పాగల్ పంతీ, తైష్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link