Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్

Wed, 06 Jan 2021-1:31 pm,

షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోకతప్పదు. షూటింగ్ నిమిత్తం బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన నటి బనితా సంధు తన వెంట కరోనా వైరస్ మహమ్మారిని కూడా తీసుకొచ్చింది. (Banita Sandhu Instagram Photos)

పైగా ఆస్పత్రిలో ఉండనంటూ రచ్చరచ్చ చేస్తోంది. అక్టోబర్ ఫేమ్, బాలీవుడ్(Bollywood) నటి బనితా సంధు సినిమా షూటింగ్ నిమిత్తం గత ఏడాది డిసెంబర్ 20 తేదీన భారత్‌కు వచ్చింది. 

Gallery: Anchor Manjusha Photos: యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

విమానంలో ప్రయాణించి కోల్‌కతాకు చేరిన ఆ నటి షూటింగ్ పనులతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రయాణించిన విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్‌గా నిర్ధారించారు. 

అసలే కొత్త వైరస్ స్ట్రెయిన్ కేసుల్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న బ్రిటన్ దేశం నుంచి వచ్చిన నటి కనుక బనితా సంధును ఆరోగ్య అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు.

ఆమెకు కరోనా పాజిటివ్ అని సోమవారం నాడు తేలింది. ఆమెను కోల్‌కతాలోని స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా నానా హంగామా చేసింది. తాను  ఆసుపత్రిలో చికిత్స తీసుకోనంటూ మొండికేసింది. పారిపోవాలని సైతం యత్నించింది.

Gallery: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్

కాగా, నటి బనితా సంధు వెంట ఉన్న అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. అంబులెన్సులో ఎక్కించి నటి బనితను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

బ్రిటీష్ నటి బనితా సంధు.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన అక్టోబర్ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమకు పరిచయమైంది.

Gallery: ​Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

అయితే ఈమెకు సోకింది కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్.. లేక పాత కరోనానా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Banita Sandhu Instagram Photos)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link