PM Svanidhi Yojana: ప్రధానమంత్రి స్వనిధి యోజన.. ఏ గ్యారంటీ లేకుండా రూ.50,000 రుణంతోపాటు 7% సబ్సిడీ..
ఒకవేళ మీరు మంచి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే ఇది మీకు గుడ్ న్యూస్ ప్రధానమంత్రి. స్వనిధి యోజన మీ కలలను సాకారం చేస్తుంది. ఈ స్కీం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. రోడ్ సైడ్ బిజినెస్ చేసే వీధి వ్యాపారుల కోసం ఇది అద్భుతమైన స్కీం. అయితే ప్రధానమంత్రి స్వనిధి యోజన అంటే ఏంటి? ఎవరు అప్లై చేసుకోవచ్చు?. దీనికి అర్హత ఏంటి? దీనికి ఏ పత్రాలు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.
ప్రధానమంత్రి స్వనిధి యోజన కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం వీధి వ్యాపారులకు ఇంకా కొవిడ్ సమయంలో జాబ్ కోల్పోయిన వారికి ఆర్థికంగా చేయూతను అందించడం.
భారత దేశంలో వీధి ఉన్న వీధి వ్యాపారులకు ఈ స్కీం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రధానమంత్రి స్వనిధి యోజనతో మీరు స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా తీసుకున్న వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఒకవేళ మీరు రూ. 10,000 తీసుకుంటే దీనికి ఎలాంటి హామీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఏడాది పాటు మీకు వర్తిస్తుంది ఒకవేళ మీరు సరైన సమయానికి మీ లోన్ ని డబ్బులు కట్టేస్తే మీకు సబ్సిడీ 7% వరకు వడ్డీ లభిస్తుంది.
మీరు ఒకవేళ ఈ పథకం కింద డిజిటల్ పేమెంట్ పద్ధతిని అనుసరిస్తే ఏడాదికి రూ. 1200 వరకు మీరు క్యాష్ బ్యాక్ పొందే సదుపాయం కూడా ఉంది. ఈ పథకానికి మామూలు పత్రాలు దరఖాస్తు చేసి లోన్ సౌకర్యాన్ని సులభంగా పొందవచ్చు.
ఈ పథకానికి అర్హులు భారతీయులై ఉండాలి. కనీసం రెండేళ్లు వీధివ్యపారం చేస్తూ ఉండాలి. లేదా తమ బిజినెస్ విస్తరించడానికి ఈ ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా లబ్ది పొందవచ్చు. ఒకవేళ మీకు కొత్తగా వీధి వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఈ లోనుకు అర్హులు.
పీఎం స్వనిధి యోజన లబ్ది పొందాలంటే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్లి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు https://pmsvanidhi.mohua.gov.in/ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.
ఈ పథకానికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, బిజినెస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం ఉంటుంది. ఇక అధికార వెబ్సైట్లో ఈ స్కీం కి సంబంధించిన వివరాలు ఉంటాయి 18002083736 టోల్ ఫ్రీ నెంబర్ కి డయల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.