Polena Anjana: ఇద్దరు కూతుర్లతో పవన్.. అంజని సొంత కూతురా? కాదా.?. నిజమేమిటంటే

Thu, 03 Oct 2024-8:47 pm,

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యింది అని,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనం సృష్టించింది.   

ముఖ్యంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు పంది కొవ్వు వాడారు అనే వార్త తెరపైకి రావడంతో హిందువులు ఈ విషయంపై మండిపడ్డారు కూడా. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి  డిప్యూటీ సీఎం గా పని చేస్తున్న ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడమే తమ ధ్యేయం అంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 

ఆ దీక్ష నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో కాలినడకన అలిపిరి మెట్ల ద్వారా స్వామివారిని చేరుకొని,  తన ఇద్దరు కూతుర్లతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఫోటోలు కాస్త బయటకు రావడంతో ఇద్దరు కూతుర్లు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా ఒకరు ఆధ్యా మనందరికీ తెలిసిన అమ్మాయి.. రేణు దేశాయ్ కూతురు. ఇంకొక అమ్మాయి అచ్చం ఆధ్యాలాగే ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా సంతానం అంటూ అందరూ కామెంట్లు కూడా చేశారు. కానీ ఇక్కడ విస్తుపోయే నిజం ఒకటి బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

రేణు దేశాయ్ నుంచి విడిపోయిన తర్వాత రష్యా కు చెందిన ప్రముఖ నటి అన్నా లెజినోవా ను మూడవ వివాహం చేసుకున్నారు పవన్. అయితే వీరి వివాహం జరిగి కేవలం 11 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న అమ్మాయి దాదాపు ఆధ్యా వయసుతో సమానంగా కనిపిస్తోంది. దీంతో ఈ అమ్మాయి ఎవరు..? నిజంగా పవన్ కళ్యాణ్ కూతురేనా లేక దత్త పుత్రికా..? అంటూ నెటిజన్స్ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ -  అన్నా లెజినోవా సంతానమే. కానీ అప్పట్లో అన్నా లెజినోవా మొదటి భర్త కారణంగా జన్మించిన అమ్మాయి అని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ అమ్మాయికి తన తల్లి అంజనీ పేరు కలిసి వచ్చేలా పొలేనా అంజనీ పవనోవ అని పేరు పెట్టారు పవన్ కళ్యాణ్. కాగా. అసలు విషయానికి వస్తే. ఈ అమ్మాయి.. పవన్ కళ్యాణ్ కి.. అన్నా లెజివోవాతో పెళ్లికాక ముందు జన్మించిన కుమార్తె. ఇదే విషయాన్ని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. కానీ అప్పట్లో ఆమె పవన్ కళ్యాణ్ కుమార్తె కాదు అంటూ కొన్ని అసత్య ప్రచారాలు జరిగాయి. అయితే అవేవీ నిజం కాదని.. అంజన సొంతం పవన్ కుమార్తె కావడంతోనే తన తల్లి పేరు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా దంపతులకు మార్క్ శంకర్ పవనోవిక్ అనే అబ్బాయి 2017లో జన్మించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link