Pooja Hegde: మరింత గ్లామర్ పెంచిన పూజ హెగ్డే.. ఎర్ర డ్రస్సులో హాట్ ఫోటోలు..

Mon, 16 Sep 2024-12:15 pm,

నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పూజా హెగ్డే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమా సరిగ్గా ఆడకపోయిన..పూజకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఆ తరువాత వెంటనే వరుణ్ తేజ్ తో ముకుందా సినిమాలో కనిపించింది. అయితే పూజా హెగ్డే కి పేరు తెచ్చిపెట్టింది మాత్రం రంగస్థలం సినిమాలోని ఐటమ్ సాంగ్. జిల్ జిల్ జిగేలు రాణి పాటతో కుర్ర కారు మదిలో.. చెరిగిపోని ముద్ర వేసుకుంది..

ఇక అప్పగించి వరస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. సాధారణంగా హీరోయిన్స్ సినిమా.‌‌. అవకాశాలు తగ్గినప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తారు. కానీ పూజా విషయంలో మాత్రం ఇది కాస్త రివర్స్ అయ్యింది. తన ఐటమ్ సాంగ్ ద్వారా వరుస అవకాశాలు అందుకుంది ఈ నటి.

ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి.. విజయాలు అందుకున్న ఈ హీరోయిన్ కి ఈ మధ్య మాత్రం టైం అసలు బాగాలేదు. ఏ ముహూర్తాన చిరంజీవి ఆచార్య సినిమా ఒప్పుకునిందో కానీ.. అప్పటినుంచి వరస ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.

ఇక వరస ప్లాపులతో సతమతమవుతున్న పూజకి తెలుగులో అవకాశాలు మరి సన్నగిల్లాయి. ఈ క్రమంలో గ్లామర్ డోస్ లో మాత్రం వెనకంజు వేయడం లేదు ఈ హీరోయిన్. తన ఇంస్టాగ్రామ్ లో మరింత గ్లామర్ డోస్ పెంచి.‌.. కుర్రకారుని ప్రేమలో పడేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link