Post Office: పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. నెలకు రూ.వెయ్యి పెట్టుబడి పెడితే..
ఈ పథకం పేరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా (SCSS). ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లు చాలా ప్రయోజనాలను పొందుతారు.
ఈ పోస్టాఫీసు పథకంలో 60 ఏళ్లు పైబడిన వారు ఖాతాలను తెరవవచ్చు. ఈ పథకంలో కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు వయస్సులో కొంత సడలింపు కూడా ఉంటుంది.
ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలో పోస్టాఫీసు ద్వారా ఏటా 7.6 శాతం వడ్డీని అందజేస్తున్నారు. ఈ పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిని పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు.
అయితే ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలకు మించకూడదు. ఈ పథకం కింద ఎవరైనా పెట్టుబడిదారుడు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఒక వ్యక్తి మెచ్యూరిటీకి ముందు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను మూసివేయాలనుకుంటే క్లోజ్ చేయవచ్చు. కానీ ప్రీ క్లోజింగ్ సమయంలో వడ్డీ మొదలైన నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.