Prabhas: ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి ప్రభాస్.. హీరోగా అయితే కాదండోయ్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని నేడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కల్కి 2898AD సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, రూ .1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఒక మార్క్ సెట్ చేసిన ఈయన ఇప్పుడు రాజా సాబ్, ఫౌజీ, కల్కి 2, స్పిరిట్, సలార్ -2 వంటి చిత్రాలు ప్రకటించారు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ పెద్ద లైన్ అప్ లోకి మరో సినిమా వచ్చే చేరింది. ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి ఓకే చెప్పారంటూ సమాచారం. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ లో వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి జై హనుమాన్ , మహాకాళీ, అధీరా, మోక్షజ్ఞ సినిమాలతో పాటు వరుస సినిమాలు అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉండగా గతంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి ఒక కథ చెప్పి, దాంతోపాటు కొన్నాళ్లు ట్రావెల్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. బ్రహ్మ రాక్షస అనే టైటిల్ తో నెగిటివ్ షేడ్స్ మెయిన్ లీడ్ తో ఉన్న ఆ సినిమా పలు కారణాలవల్ల రణవీర్ సింగ్ తో క్యాన్సిల్ అయింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.
అంతేకాదు ఈ బ్రహ్మరాక్షస సినిమా కథను ప్రశాంత్ వర్మ ప్రభాస్ కి చెప్పగా ఆయన కూడా ఎప్పటి నుంచో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలని అనుకుంటున్నాడని అందుకే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా 2027లో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.