Ram Nath Kovind: రాష్ట్రపతికి సీఎం జగన్, గవర్నర్ ఘన స్వాగతం
అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం తిరుమల చేరుకోని శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రాష్ట్రపతి చెన్నైకు బయలుదేరి వెళ్లనున్నారు.
అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు ప్రత్యేకంగా, అత్యాధునిక పరికరాలతో తయారు చేయించిన ఎయిర్ ఇండియన్ వన్ బీ 777 విమానంలో తిరుమలకు చేరుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం ఈ విమానాన్ని ప్రారంభించి న్యూఢిల్లీ నుంచి తిరుపతికి పయనమయ్యారు.