Punarnavi Wedding: పునర్నవి భూపాలం మ్యారేజ్ ఫిక్స్ అయిందా?

Thu, 29 Oct 2020-6:07 pm,

టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam Engagement) తన చేతి వేలికి ఉంగరాన్ని చూపించి మొదటగా తన అభిమానులను, నెటిజన్లకు షాకిచ్చారు. ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించడంతో తనకు కావలసిన వ్యక్తి ఉద్భవ్ రఘునందన్ ఫొటో (Udbhav Raghunandan photos)ను షేర్ చేసింది బిగ్‌బాస్ బ్యూటీ. మరోవైపు ఉద్భవ్ సైతం అవును.. ఆమె నాకు ఓకే చెప్పింది అని చెప్పి చెప్పనట్లుగా హింట్ ఇచ్చి వదిలాడు. ఉద్భవ్ రఘునందన్‌తో పునర్నవి కలిసి ఉన్న ఫొటోతో పాటు పునర్నవి చేతి వేలికి ఉంగరం ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకు పునర్నవి ఫొటోలు సైతం ఇక్కడ అందిస్తున్నాం. (Photos Credit: Instagram)

ఓ స్నేహితురాలు అసలు విషయం ఏంటి.. నిజంగానే మ్యాటర్ ఉందా.. నమ్మవచ్చా అని టాలీవుడ్ నటి పునర్నవిని అడిగింది. అక్టోబర్ 30 వరకు వేచి చూడు అని బదులిచ్చింది. కానీ ఇది సినిమా, వెబ్ సిరీస్ ప్రమోషనా లేక నిజంగానే పెళ్లికి సంబంధించిన అడుగులు పడుతున్నాయా అని తెలియక నెటిజన్లు, పునర్నవి ఫ్యాన్స్  సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. 

. కానీ పునర్నవి ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని గమనిస్తే అప్పటివరకూ బిగ్‌బాస్ బ్యూటీ ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టుల అసలు విషయం తెలియాలంటే మరో రోజు (అక్టోబర్ 30) వరకు ఆగాల్సిందే.

తనకు కాబోయే భర్త ఫొటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది పునర్నవి. అయితే పనిలో పనిగా అతడు ఎవరో తెలుసుకునేలా అతడి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ఐడీని ట్యాగ్ చేసింది. అదే సమయంలో ఉద్భవ్ రఘునందన్ సైతం ఆమె ఒకే చెప్పిందంటూ ఈ ఫొటో షేర్ చేశాడు.

 పునర్నవి ఏం చెప్పాలనుకుంటుంది, ఎవరి గురించి చెప్పనుందో నెటిజన్లు పసిగట్టేశారు. పునర్నవి చేతికి ఉన్నది నిశ్చితార్థపు ఉంగరమేనని (Punarnavi Engaged To Udbhav Raghunandan) అని నెటిజన్లు ఇప్పుడు నమ్ముతున్నారు.

ఉద్భవ్ రఘునందన్ (Udbhav Raghunandan) అనే నటుడుతో పునర్నవి ప్రేమలో పడిందని తెలుస్తోంది. ఉద్భవ్ రచయిత, ఫిల్మ్ మేకర్‌ కూడా అని ప్రొఫైల్ చూస్తే అర్థమవుతోంది.

ఉద్భవ్ రఘునందన్ ప్రపోజ్ చేయగా నటి పునర్నవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు రేపు చెబుతానంటూ మరో పోస్ట్ చేసింది.  

All Images Credit: Instagram

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link