Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?
పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారం తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత ఎన్నో ఘటనల తర్వాత ఈరోజున ఆ రహస్య గది ద్వారాలను 11 మందితో కూడిన ప్రత్యేక బృందం తెరిచారు. అంతకు ముందు అధికారులు ఈ ద్వారం ఓపెన్ చేయడానికి ముందు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా పూరీ జగన్నాథుడికి ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోని కింద రహస్య భాండాగారం గది ఉంది. దీనిలో కూడా జగన్నాథుడికి చెందిన అనేక కొన్ని చెక్కెపెట్టేల నిండా వజ్రాలు,ఆభరణాలు ఉన్నాయని చెప్తుంటారు. పూరీ రహస్య గదికి ముందు మూడు ఛాంబర్ లు ఉంటాయి.
మొదటి ఛాంబర్ లో జగన్నాథుడికి ప్రతిరోజు ధరించే బంగారం, ఇతర ఆభరణాలు ఉంటాయి. రెండో ఛాంబర్ లో వేడుకలు, ఉత్సవాల సమయంలో వేసే అత్యంత విలువైన ఆభరణాలు ఉంటాయంట. ఇక మూడోది అత్యంత రహస్యమైన భండాగారంగది ఛాంబర్ ఉంటుంది. దీన్ని చివరి సారిగా.. 1978 లో ఓపెన్ చేశారు. అప్పట్లో ఆభరణాలు లెక్కింపుకు 70 రోజులు పట్టిందంట.
ఆ లెక్కింపులో.. 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి ఉన్నాయంట. ఆభరణాల లెక్కింపు కోసం 70 రోజులు పట్టిందంటే.. ఏమాత్రం నిధులు ఉన్నాయో అర్థం చేసుకొవచ్చు. మరోమారు 1985 లోను ఆ రహస్య గదిని తెరిచారంట. కానీ ఎందుకొ అప్పట్లో లెక్కింపు సరిగ్గా చేయలేదంట. అప్పటి నుంచి మరల ఇప్పటి వరకు కూడా ఆ గదిని తెరవలేదు
ఈ క్రమంలో ఈరోజున 11 మందితో కూడిన ప్రత్యేక బృందం రహస్య గదిని తెరిచారు. సుమారు 46 ఏళ్ల తర్వాత భాండాగారంలోని విలువైన నగలు, బంగారు ఆభరణాలను 11 మందితో కూడిన ప్రత్యేక బృందం బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వీటిని అప్పటికే సిద్ధం చేసిన ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టెల ద్వారా వాటిని వెలుపలకు తీసుకొచ్చామని ‘శ్రీ జగన్నాథ్ ఆలయం’ చీఫ్ అరబింద పధే ప్రకటించారు.
లోపలి ఛాంబర్ తెరిచే ఉంటుందని, పూర్తి ప్రక్రియను ముగించేందుకు తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆభరణాలను ఒకే చోట పెట్టేల్లో పెట్టి అక్కడే భద్రపరిచామని, మరిన్ని పూజలు, ఇతర కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏ రోజున తరలిస్తామో చెప్తామన్నారు. రత్న భాండాగారంలోని మూడవ గది తలుపు తాళం పనిచేయకపోవడంతో యంత్రంతో కట్ చేసి తెరిచినట్టు సమాచారం. తలుపులు తెరిచిన తర్వాత గది నుంచి గబ్బిళాలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్పీ పినాక్ మిశ్రా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను అక్కడే ఉన్న హెల్త్ క్యాంప్ కు తరలించారు. డాక్టర్ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికి కూడా అక్కడున్న వారు కాస్తంతా క్యూరియాసిటీతో పాటు, భయంతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే.. గతంలో చెప్పినట్లుగా విషసర్పాలు, కాలనాగుల దాడుల వంటి ఘటనలు జరగలేదని అధికారులు చెప్పినట్లు సమాచారం.