Puri Ratna bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. సంచలన విషయాలు బైట పెట్టిన అధికారులు..
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంను అధికారులు 46 ఏళ్ల తర్వాత నిన్న తెరిచారు. ఆదివారం మధ్యాహ్నం అధికారులు శుభమూహుర్తంలో 11 మంది ప్రతినిధులు ఈ ద్వారాలను ఓపెన్ చేశారు. అంతకు ముందు ఈ ద్వారాలు తెరిచే ముందు అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. నాగబంధనం ఉందని, పాములు దాడు చేయోచ్చని భారీగా ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో అధికారులలు నాగబంధనం, పాములతో ఇబ్బందులు కల్గకుండా భారీగా పాములను పట్టేవారిని రెడీగా పెట్టుకున్నారు. ఈ రహస్య గదిని.. 1978 లో ఓపెన్ చేశారు. ఆ తర్వాత మరల 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరిచారు. 2018 లో ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు రహస్య గదిని ఓపెన్ చేయడానికి ప్రయత్నాలుచేసిన కూడా తాళాలు లేకపోవడం వల్ల డోర్స్ ఓపెన్ చేయలేదంట.
11 మంది అధికారుల ప్రతినిధులు నిన్న మధ్యాహ్నం రహస్య గదిని తెరవడానికి ట్రై చేశారు. కానీ తాళాలు తెరుచుకోకపోవడంతో అధికారుల ముందు తాళాలను పగలకొట్టారంట. రహస్య గదిని ఓపెన్ చేయగానే.. ఒక్కసారిగా గబ్బిలాలు బైటకొచ్చాయంట. మరోవైపు అక్కడే ఉన్న ఎస్పీ సొమ్మసిల్లి పడిపోయారు. భాండాగారంలో తొలిరెండు గదులు తెరిచారు. వీటిలో స్వామి వారికి నిత్యం ఉపయోగించే ఆభరణాలు ఉంటాయి.
లోపల ఇత్తడి పూత ఉ్న ఆరు కొత్త చెక్కపెట్టేల్లో, మొదటి, రెండు గదుల్లోని ఆభరణాలను బైటకు తీసుకొచ్చారు.పొడవు.. 4.5 అడుగులు, ఎత్తు 2.5 అడుగులు, వెడల్పు 2.5 అడుగులు ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటివి మొత్తం 15 పెట్టెలు చేయాలని అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. ఈరోజు ఆలస్యమైపోవడంతో.. రాత్రిపూట గదులు క్లోజ్ చేసినట్లు సమాచారం.
జస్టిస్ రథ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భాండాగారం లోపల తెమగా ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. రహస్య గదిలో.. సంపద అన్న, పెట్టేలు, అల్మారాలు చూశామని చెప్పారు. రహస్యగదిలో ఉన్న సంపదను, మొదట గర్భగుడికి దగ్గరగా ఉన్న గదిలోకి తరలిస్తామన్నారు. ఆతర్వాత పురావాస్తు అధికారులు మరమ్మత్తులు చేస్తారన్నారు.
మరల పనులు పూర్తయిన తర్వాత.. మళ్లీ భాండాగారం ఎప్పుడు తెరుస్తామనేది తర్వాత ప్రకటిస్తామన్నారు. సోమవారం జగన్నాథుడి బహుడా యాత్ర, 17 న సున్నాబేషో వేడుకలు జరుగుతాయని రథ్ తెలిపారు. భాండాగారంలోనికి వెళ్లినప్పుడు.. హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల పూరీలో భక్తుల కోసం నాలుగు తలుపులు తెరిచారు. అదే విధంగా ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరవడం పట్ల పూరీలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.