Pushpa 2 Movie: పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు.. బెనిఫిట్‌షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కారు.. ఒక్కొ టికెట్ ఎంతంటే..?

Sat, 30 Nov 2024-3:44 pm,

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా పుష్పా2 మేనియా నడుస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మూవీకి చెందిన ప్రమోషన్లు నిర్వహిస్తు చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే అనేక బ్లాక్ బాస్టర్ రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఈ మూవీ టీమ్.. బీహార్, చెన్నై, కొచ్చి, ముంబైలలో ఈవెంట్స్ లను నిర్వహించింది.

అక్కడి ఆడియన్స్ నుంచి అనూహ్యంగా స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అభిమానులు.. ప్రస్తుతం పూనకాలతో ఊగిపోతున్నారని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ మూవీకి తెలంగాణలో బెనిఫిట్ షోలలో కూడా ధరలను పెంచుకునే విధంగా సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తొంది.  

డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోలతో పాటు.. అర్ధరాత్రి 1 గంటకు షోకు కూడా తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో సైతం జారీ చేసినట్లు ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర రూ. 800 ఖరారు చేసింది.  

అదే విధంగా..తెలంగాణ వ్యాప్తంగా.. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే రూ.800గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్దరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్ లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

మరొవైపు .. పుష్ప 2 సినిమా మొత్తం ఆరు భాషలలో 12 వేలకు పైగా థియేటర్లలో విడుదలకానుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ మాత్రంఫుల్ ఖుషీతో ఉన్నారంట. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బన్నీ చేసిన వీడియోపై స్పందించారు. ఇలాంటి వీడియోలు తీసి.. అవగాహన కల్పించినందుకు బన్నీని ప్రశంసించారు.  

అల్లు అర్జున్ డ్రగ్స్ రహిత సమాజంను నిర్మించేందుకు అందరు ముందుకు రావాలని, ఎక్కడైన డ్రగ్స్ అమ్మిన, కొన్న, అలాంటి వాళ్ల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పిన విషయం తెలసిందే. సీఎం రేవంత్ కూడా.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతు డ్రగ్స్ రహిత తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link