Indian Railway: స్లీపర్ కోచ్‌లో రైలు ప్రయాణం చేస్తున్నారా? ఎంత లగ్గేజీ తీసుకెళ్లాలి? ఫైన్ పడుతుంది జాగ్రత్త..
ప్రతిరోజూ మన దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది నిత్యం రైలు ప్రయాణం చేస్తుంటారు. కుటుంబ సభ్యుల సమేతంగా లేదా స్నేహితులతో కలిసి ట్రిప్ వేస్తారు. అయితే, తమతోపాటు లగ్గేజీని కూడా తీసుకెళ్తారు. నిత్యం వేల రైళ్లను నడిపే ఇండియన్ రైల్వే రూల్స్ కూడా ఉన్నాయి. మీతోపాటు ఎన్ని కేజీల లగ్గేజీని తీసుకు వెళ్లాలి మీకు తెలుసా?
ఇతర ప్యాసింజర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొన్ని నిబంధనలను రైల్వే ప్రవేశపెట్టింది. మీరు కూడా కొత్తగా రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే ఈ రూల్ ఎంటో ఇప్పుడే తెలుసుకోండి.
సాధారణంగా మన దేశంలో ఏ రైలులో అయినా ప్రయాణించాలంటే 40 నుంచి 70 కేజీల వరకు లగ్గేజీ తీసుకెళ్లవచ్చు. అది కూడా వారు ఎంచుకున్న కోచ్ ఆధారంగా ఈ లిమిట్ ఉంటుంది.
ఒకవేళ మీరు స్లీపర్ కోచ్‌లో ప్రయాణించినట్లయితే మీరు కేవలం 40 కేజీల వరకు మాత్రమే లగ్గేజీ తీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ ఇంతకు మించి తీసుకు వెళ్తే అది రైలు రూల్స్ అతిక్రమించినట్లు టీసీ దీనికి ఫైన్ కూడా విధిస్తాడు.
3 ఏసీలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే, మీరు 40 కేజీల వరకు లగ్గేజీ మీతోపాటు తీసుకువెళ్లొచ్చు. 2 ఏసీ రైలు ప్రయాణం చేసేవారు 50 కేజీల వరకు లగ్గేజీ బరువు తీసుకెళ్లే సౌకర్యం కలదు.
మీరు ఫస్ట్ ఏసీలో రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే మీతోపాటు 70 కేజీల వరకు తీసుకెళ్లవచ్చు. దీనికి మించి బరువు ఉన్న లగ్గేజీ తీసుకు వెళ్తే మీరు కచ్చితంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది.