Rambha Family Pics : హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రంభ కూతురు.. ఫోటోలు వైరల్
హీరోయిన్ రంభ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తుంటుంది. రంభ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
రంభ ఫ్యామిలీకి జరిగిన కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. గత వారంలో జరిగిన ఈ ప్రమాదంతో రంభ ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.
అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో రంభ పెద్ద కూతురు సాషాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె బెడ్డుపై కదల్లేని స్థితిలోకి వెళ్లింది. తన కూతురి కోసం అందరూ ప్రార్థించండి అని రంభ కోరింది.
రంభ పోస్టుపై అనూహ్యమైన స్పందన వచ్చింది. రంభ ఫ్యామిలీ, ఆమె కూతురు క్షేమంగా ఉండాలని సోషల్ మీడియా మొత్తం ప్రార్థనలు చేసింది.
రంభ కూతురు ప్రస్తుతం క్షేమంగా ఉంది. ఆమె తన కూతురు ఫోటోలను అందరికీ చూపించింది. తాము క్షేమంగా ఉన్నామని ఇలా తన అభిమానులకు తెలియజేసింది.