Ramoji rao: రామోజీ రావు ఒక సినిమాలో న్యాయమూర్తి గా నటించారు.. అదేంటో తెలుసా..?

Sat, 08 Jun 2024-8:01 pm,

ఈనాడు గ్రూప్, రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థల అధినేత రామోజీ రావు ఈరోజు (శనివారం) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తో వ్యాపార ప్రస్థానంలో రామోజీ తొలి అడుగు వేశారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు. 

విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగారు. సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజాహృదయాల్ని గెలుచుకున్నారు. మీడియా సంస్థ సారథిగా ప్రజాహితంకోసం పాటుపడినా మాతృభాష పరిరక్షణకు నడుంకట్టినా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. 

చైతన్య దీపికల్లాంటి సినిమాల నిర్మాతగా భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లెక్కలేనంత మందికి రామోజీరావు పరోక్ష లబ్ధి చేకూర్చారు. రామోజీ రావు అకాల మరణం పట్ల ఇటు సినీరంగం నుంచి, రాజకీయ రంగాల ప్రముఖులు నివాళులు అర్పించారు.

రామోజీ రావు మరణం తర్వాత ఆయన గురించి అనేక ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరణించక ముందే సమాధిని ఏర్పాటు చేసుకొవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు రామోజీ ఒక తెలుగు సినిమాలో కూడా నటించారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

రామోజీరావు యు. విశ్వేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన "మార్పు'' సినిమాలో అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా 1978 లో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామోజీ రావు న్యాయమూర్తి పాత్రను కూడా పోషించారు. 

ఈ మూవీలో రామోజీ రావు అతిథి పాత్రలో నటించిన కూడా, పోస్టర్స్ పైన రామోజీ బొమ్మ వేయడం అందరిని అప్పట్లో వార్తలలో నిలిచింది.  సినిమాలంటే రామోజీకి ఇష్టమున్న క్రమంలోనే ఆయన ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించారు. కాగా, ఉషాకిరణ్ మూవీస్ నుంచి మొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ తీశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link