KCR Ifthar Party: అత్యంత ఘనంగా కేసీఆర్ ఇఫ్తార్ పార్టీ, ఒవైసీకు ఖర్జూరం తిన్పించిన కేసీఆర్
ఇఫ్తార్ పార్టీని తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎల్బీ స్డేడియంలో అత్యంత ఘనంగా, అన్ని వసతులతో ఏర్పాటు చేసింది.
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీ, హలీం సహా ముస్లిం సాంప్రదాయ వంటల్ని సిద్ధం చేశారు.
కేసీఆర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో పాల్గొని విందు ఆరగిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ సంతోష్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో తెలంగాణ టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు
రంజాన్ ఇఫ్తార్ పార్టీ సందర్భంగా ముస్లిం చిన్నారులకు ప్రత్యేకంగా రంజాన్ కిట్స్ అందించారు. ఆ కిట్లను అందిస్తూ చిన్నారుల్ని పలకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఇఫ్తార్ పార్టీలో ముస్లిం విద్యార్ధులతో అభివాదం చేస్తూ ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా విద్యార్దులకు ప్రత్యేకంగా రంజాన్ బహుమతుల్ని అందించారు.
తెలంగాణ మంత్రి మెహమూద్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి సాంప్రదాయ వస్త్రాన్ని కట్టి..ఆహ్వానించారు.
రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన ఇఫ్తార్ పార్టీలో ముస్లిం విద్యార్ధులకు రంజాన్ కిట్స్ అందించారు కేసీఆర్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలను కలుసుకుని వారి సాంప్రదాయపద్ధతిలో అభివాదం చేశారు.
ఇఫ్తార్ పార్టీ అత్యంత సంప్రదాయబద్ధంగా, ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం మతగురువులకు కలుసుకుని సత్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
దేశం నాశనం అవుతుంటే.. కావాలని దేశంలో దుష్ట పరిస్థితులను సృష్టిస్తుంటే .. దేశవాసులుగా ఆపాల్సిన బాధ్యత అందరిపై ఉందని..దేశాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రయోజనాల కోసం అందరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఎల్బీ స్డేడియంలో అత్యంత ఘనంగా రంజాన్ మాసం ఇఫ్తార్ పార్టీ ఏర్పాట్లు జరిగాయి. అదే వేదిక నుంచి కేసీఆర్ సహా నేతలు మాట్లాడారు.
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.కేంద్రానికి ఏదో రోగం పట్టుకుందని..దాన్ని సరిచేయాలని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకు ఖర్జూరం తిన్పించడం ద్వారా ఉపవాసం విడిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ఎల్బీ స్డేడియంలో అత్యంత ఘనంగా ఏర్పాటైన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ ఒవైసీ, కేశవరావు తదితరులు
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన ఇఫ్తార్ పార్టీలో ముస్లిం మతగురువులకు ఖర్జూరం తిన్పిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ముస్లింలు ఖర్జూరంతో ఇఫ్తార్ చేయడం ద్వారా ఉపవాసం విడుస్తారు.