Happy New Year Muggulu 2025: కొత్త సంవత్సరం 2025 ముగ్గులు వచ్చేశాయి.. మీ వాకిలి నిండా నింపండి..
భారత్‌లో అన్ని పండగలకు రంగోలి వేసుకుంటారు. అలాగే ఆంగ్ల కొత్త సంవత్సరం సందర్భంగా కూడా ముగ్గులను వేయడం ఆనవాయితిగా వస్తోంది. మీరు కూడా ఈ మీ ఇంటి ముందు ముగ్గులు వేస్తారా..?
ముగ్గులనేవి తరతరాలుగా వస్తున్న ఒక ప్రత్యేకమైన సాంప్రదాయంగా భావించవచ్చు. వీటిని ప్రతి శుభ కార్యాలకు, పండగలకు ఇంటి వాకిట్లో వేసుకుంటారు.
అంతేకాకుండా ఈ ముగ్గులను సాక్ష్యత్తు లక్ష్మీదేవిగా కూడా చెప్పుకుంటారు. వీటిని ఇంటి ముందు వేయడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుందని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ వేసుకుంటారు.
అలాగే కొత్త సంవత్సరం రోజున కూడా ఈ ముగ్గులను వేసుకోడం వల్ల ఏడాది మొత్తం శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.. అందుకే ఆంగ్ల కొత్త సంవత్సరం రోజు కూడా ముగ్గులు వేసుకుంటారు..
పురాణాల ప్రకారం.. ఇంటి ముందు ముగ్గులు పెట్టడం వల్ల దేవతలు సంతోషిస్తారట. ఇలా కొత్త సంవత్సరం రోజు ముగ్గులు పెడితే.. ఏడాది మొత్తం మంచి జరుగుతుందని నమ్మకం...
ముగ్గులు అనేవి ఒక రకమైన కళాత్మకతను కూడి ఉంటాయి. చుక్కలుగా పెట్టి, ముగ్గులను అల్లుతారు. అంతేకాకుండా ముగ్గులు పెట్టి వాటికి పూజలు కూడా చేస్తారు.
అలాగే ఈ ముగ్గులను మన పూర్వీకులు మనం నిత్యం చూసే పక్షులు, జంతువులు ఆకారాలు కూడా వేసేవారు. అలాగే కొన్ని రకాల పూలను కూడా ముగ్గులుగా వేస్తారు.
అంతేకాకుండా ముగ్గులు ఆధ్యాత్మిక భావనను కలిగి ఉంటాయని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు. వీటి ఇంటి ముందు వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి..
అలాగే ఇంటి ముందు వివిధ రకాల కలర్స్‌తో ముగ్గులు వేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి కూడా ప్రవేశిస్తుందని సమాచారం. అందుకే చాలా మంది వీటిని వేసుకుంటారు..
ముగ్గులు సమాజంలో ఐక్యతను కూడా పెంచుతాయి. ఇప్పుడు కుల, మతం అని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వీటి వేసుకుంటున్నారు. .