Rashmika Mandanna: రష్మిక బ్లౌజ్ చూశారా.. అమ్మాయిల కోసం బెస్ట్ డిజైనర్ ఐడియా..

Sun, 22 Sep 2024-8:03 am,

ముఖ్యంగా గీతగోవిందం సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఈ సినిమా అందించిన విజయం ఏకంగా మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది. అలా సరిలేరు నీకెవ్వరు సినిమాలో  మహేష్ బాబు సరసన నటించి అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు బాగా తలుపుతట్టాయి. అందులో భాగం గానే వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది రష్మిక. 

తమిళ్, కన్నడ, తెలుగు అంటూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈమె ఇటీవలే బాలీవుడ్లోకి కూడా వెళ్లిపోయింది. రణబీర్ కపూర్ తో ఈమె చేసిన యానిమల్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప  సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 

మరొకవైపు రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్స్ తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ బోహో లెహంగా ధరించి యువతను మెస్మరైజ్ చేసింది. వింటేజ్ లుక్కులో యువతను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.  

తాజాగా ఇండియన్ ఐడల్ లో కనిపించిన ఈమె ఇలా బ్లాక్ కలర్ లెహంగాపై గోల్డెన్ కలర్ ఫ్లవర్ తో డిజైన్ చేసిన లెహంగాను ధరించింది. దీనికి మ్యాచింగ్ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చోలీనీ జత చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక వీటికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ జువెలరీతో మ్యాచ్ చేసింది.   

ఇక బ్యాక్ లైస్ డిజైనర్ బ్లౌజ్ ద్వారా ఎథ్నిక్  స్టైల్ కి ప్రత్యేకమైన హంగులు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఈ డ్రెస్ లో రష్మిక చాలా అందంగా అద్భుతంగా మెరిసిపోతుంది. ఈమె  లుక్కు చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. మొత్తానికి అయితే తన అంద చందాలతో గ్లామర్ లుక్కుతో యువతను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది రష్మిక.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link