US Recession: అమెరికాలో మాంద్యం చీకట్లు..త్వరలోనే బంగారం తులం లక్ష దాటే ఛాన్స్

Sun, 08 Sep 2024-3:20 pm,

US Recession Gold Effect:అమెరికాలో ఆర్థిక మాంద్యం నీలి నీడలు మరోసారి కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన సూచనలు వెలువడుతున్నాయి. ఇటీవల విడుదలైన అమెరికా జాబ్స్ డేటా ఊహించిన దానికన్నా తక్కువగానే నమోదైనప్పటికీ ఇప్పటికీ ఈ జాబ్స్ డేటా ద్వారా పలు రకాల డేంజర్ సిగ్నల్స్ అందుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు నెలలో కొద్దిగా తగ్గుముఖం పట్టింది జూలై నెల తో పోల్చి చూసినట్టయితే 4.6% జాబ్స్ డేటా తగ్గుదల నమోదు చేసింది. ఇది జాబ్స్ డేటా లేదా అమెరికాలోని కీలక ఆర్థిక సూచీల్లో ఒకటి అమెరికాలో నిరుద్యోగిత పెరిగినట్లయితే మాంద్యం నీలి నీడలు కమ్ముతున్నట్లు చెప్పవచ్చు. 2007లో సబ్ ప్రైమ్ సంక్షోభం అనంతరం అమెరికా ఆర్థిక మాంద్యం ఎదుర్కొంది.  

దీనికి తోడు ఇప్పటికే పలు ఐటి కంపెనీలు లే ఆఫ్ లను ప్రకటిస్తున్నాయి ఇప్పటికే మైక్రోసాఫ్ట్, meta xd ఒరాకిల్ అమెజాన్ వంటి సంస్థలు లే ఆఫ్ లను ప్రకటించాయి. దీంతో వేలాదిమంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. దీని ప్రభావం అమెరికా జాబ్స్ డేటా మీద చూపిస్తోంది. ఇది కంపెనీ ఉత్పాదకపత మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.  

దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా అక్కడి స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ అండ్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో అటు అమెరికా కఠినమైన వీసా చట్టాలను అమలు చేస్తుందని సూచనలు వస్తున్నాయి. ఫలితంగా విదేశీ నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది.  

 ఫలితంగా దీని ప్రభావం కంపెనీలపై పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ట్రంప్ హయాంలో అమెరికా ఫస్ట్ నినాదం వల్ల వీసా నిబంధనలు కఠిన తరమై హెచ్ వన్ బి వీసాల కొరత ఏర్పడింది. దీంతో కంపెనీలకు విదేశీ నిపుణుల కొరత ఏర్పడి వేతనాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఆయా కంపెనీల లాభదాయకత దెబ్బతిన్నది.  

ఇదిలా ఉంటే మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పావు శాతం మేర తగ్గించే అవకాశం ఉందని ఇటీవల అంచనాలు వెలబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విడుదల చేసే పది సంవత్సరాల ట్రెజరీ బాండ్ల విలువ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ఇన్వెస్టర్లు అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే బంగారం ధర 2500 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులను తగ్గించినట్లయితే బంగారం ధర అమెరికాలో 2700 డాలర్లు దాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.  

ఈ నేపథ్యంలో బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇక మన దేశంలో గమనించినట్లయితే బంగారం ధరలు ఇప్పటికే 10 గ్రాములకు గాను 73000 రూపాయల ఎగువన ట్రేడ్ అవుతోంది. గతంలో బంగారం ధర 75000 రూపాయల ఎగువన ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది. 

ఇక ప్రస్తుతం కూడా బంగారం ధర 80,000 రూపాయల టార్గెట్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ స్థాయికి చేరుకోవడానికి దసరా దీపావళి సీజన్లో దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రెండు ఇలాగే కొనసాగినట్లయితే ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం 10 గ్రాములకు గాను ఒక లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link