Redmi Turbo 4 Price: ఇది ఐఫోన్ 16 కాదు భయ్యా.. Redmi Turbo 4 మొబైల్.. లాంచ్ తేది, ఫిక్స్ లీక్!
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంటి కెమెరా మాడ్యూల్ కలిగిన Redmi Turbo 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనిని కంపెనీ 2025 సంవత్సరంలో జనవరి 2న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 8400-అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ కాబోతున్నట్లు సమాచారం.
ఎంతో శక్తివంతమైన చిప్ సెటప్‌లో డైమెన్సిటీ 8400-అల్ట్రా చిప్‌సెట్ ఒకటి.. అయితే ఈ చిప్‌సెట్‌తోనే Redmi Turbo 4 స్మార్ట్‌ఫోన్ విడుదల కావడం విశేషం. అయితే ఈ మొబైల్ రెండు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. దీని లుక్ అచ్చం చూడడానికి ఐఫోన్ 16ని పోలీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ Redmi Turbo 4 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. వెనక నుంచి చూడడానికి అచ్చం యాపిల్ 16ని పోలి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ డిజైన్‌కు సంబంధించిన వివరాలు ఇంకా కంపెనీ వెల్లడించలేదు. కానీ ఇది మాత్రం ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది మైక్రో స్పీకర్స్‌ను కూడా కలిగి ఉండబోతోంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6,550mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
ఇక దీని అంచుల వాల్యూమ్ రాకర్స్‌తో పాటు ప్రత్యేకమైన SIM స్లాట్, మైక్రోఫోన్, USB-C పోర్ట్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ 6.67-అంగుళాల AMOLED స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఈ డిస్ల్పే 1.5K రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది.
రెడ్‌మీ టర్బో 4 స్మార్ట్‌ఫోన్ కెమెరా 20-మెగాపిక్సెల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్‌లో 50-మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ సాధరణ మోడల్ 16GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది.