Republic Day 2021: 72వ రిపబ్లిక్ డే.. 5 ముఖ్యమైన విషయాలు

Tue, 19 Jan 2021-3:00 pm,

కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో తొలిసారి గణతంత్ర దినోత్సవం(Republic Day) జరుపుకోబోతున్నాం. జనవరి 26న 72వ భారత గణతంత్ర దినోత్సవం. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల నడుమ రిపబ్లిక్ డే నిర్వహిస్తారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది విదేశీ ప్రత్యేక అతిథి హాజరు కావడం లేదు. విదేశీ అతిథి లేకుండానే భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. 1952, 1953 మరియు 1966లలో విదేశీ అతిథి హాజరు కాలేదు. (ANI Photo)

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు రిపబ్లిక్ డే నిర్వహణను కోవిడ్-19 నిబంధనల నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 1.5 మీటర్ల సోషల్ డిస్టాన్సింగ్‌తో మార్చ్ చేయనున్నారు. (ANI Photo)

Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన

321 పాఠశాలల విద్యార్థులు మరియు 80 జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.  ఈస్ట్ జోన్‌కు చెందిన కళాకారులు సైతం గణతంత్ర వేడుకలో పాలు పంచుకోనున్నారని ప్రకటించారు.

Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

ఈ ఏడాది అట్టారి సరిహద్దులో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడం లేదు. జనవరి 26న భారత్, పాకిస్తాన్‌లు సంయుక్తంగా పరేడ్ నిర్వహించేవి. కరోనా నేపథ్యంలో మార్చి 2020 నుంచి సామాన్యులను అట్టారి బార్డర్‌లోకి అనుమతించడం లేదని తెలిసిందే. (ANI Photo)

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..

నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుసుతున్న రైతులు  రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. 5000 మంది రైతులు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారని అంచనా. (ANI Photo)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link