Ar Rahman: రెహమాన్ ఒక జెమ్.. విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి స్పందించిన సైరా భాను... ఏంచెప్పిందంటే..?
సైరాభాను తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు నవంబరు 19న అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తన లాయర్ వందనాషాఈ ప్రకటన చేసింది. ఈ క్రమంలో అప్పటి నుంచి రెహమాన్ ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటున్నారు.
దాదాపు.. 29 ఏళ్ల తర్వాత తమ వైవాహిక బంధానికి వీరిద్దరు పుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తొంది. వీరికి 1995 లో పెళ్లి జరిగింది. అదే విధంగా ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. రెహమాన్ డైవర్స్ జరిగిన కొన్ని గంటలకు ఆయన దగ్గర పనిచేసే బాసిస్ట్ సింగర్ కూడా తన భర్తతో డైవర్స్ ప్రకటించింది.
దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దీనిపై మోహినీ డే సైతం క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయోద్దని, దీనిలో నిజంలేదని స్పష్టం చేశారు. రెహమాన్ పిల్లలు సైతం.. తమ తల్లిదండ్రుల గోప్యతను భంగం కలిగే విధంగా చేయోద్దని కూడా పోస్టులు పెట్టారు. ఈక్రమంలో ఏఆర్ రెహమాన్ మాత్రం ఈ రూమర్స్ తో ఎక్కువగా నొచ్చుకన్నట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏ ఆర్ రెహమాన్ పై వస్తున్న రూమర్స్ ను ఖండిస్తు ఆయన మాజీ సతీమణి సైరా భాను రంగంలోకి దిగారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయోద్దని ఆయన మంచి వారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. ఇన్నేళ్లలో తాను.. రెహామన్ తో ఉన్నానని.. దయచేసి ఆయన పేరు, ప్రతిష్టలు దెబ్బతీసేలా కల్పితాలు ప్రచారం చేయోద్దని చెప్పుకొచ్చారు.
తాము ఇద్దరం ఒకరికొకరు చెప్పుకొని.. రెస్పెక్ట్ ఫుల్ గా.. విడిపోయామని.. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించిన పర్వాలేదు కానీ.. ఎగతాళి చేసి లేని పోనీ వివాదస్పద రూమర్స్ వ్యాప్తి చేయోద్దని ముఖ్యంగా మీడియా సంస్థల్ని.. తమిళ మీడియాను సైరా కోరినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. రెహామాన్ సైతం.. సోషల్ మీడియాలో ఫెక్ పోస్ట్ లపై ఇటీవల సీరియస్ అయ్యారు. 24 గంటల్లో ఈ ఫెక్ వీడియోలు, ఫోటోలను డిలీట్ చేయకుంటే.. చట్టపరంగా ముందుకు వెళ్తానని కూడా స్పష్టం చేశారు.ఈ క్రమంలో ప్రస్తుతం సైరా భాను తన మాజీ భర్తకు సపోర్ట్ ఇవ్వడం మాత్రం వార్తలలో నిలిచింది.