Samantha: దర్శకుడితో సమంత డేటింగ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో.. తెలుగు ప్రేక్షకులను నిజంగానే మాయ చేసింది ఈ హీరోయిన్. ఇక ఆ సినిమా హీరో నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లాడిన సమంత.. కొద్ది రోజులకు విడాకులు తీసుకుంది. ఇందుకు గల కారణం.. నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉండదమే అని ఈమధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నాగచైతన్యన్ని 2017లో సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి.. నాగచైతన్య మతమైన హిందువుల పద్ధతిలోనూ.. అలానే సమంత మతమైన క్రిస్టియన్ పద్ధతిలోనూ జరిగింది. అక్కినేని ఫ్యామిలీ.. ఈ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపారు. అయితే మొదటి మూడుసంవత్సరాలు చూడడానికి ఎంతో చూడచక్కగా కనిపించిన ఈ జంట.. ఆ తరువాత అనుకోని కారణాలవల్ల విడిపోయారు.
తాజాగా నాగచైతన్య.. హీరోయిన్ శోభిత దూళిపాల తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. నాగచైతన్య, శోభిత మధ్య ప్రేమ వల్లే అప్పట్లో సమంత విడాకులు తీసుకుంది అని.. సోషల్ మీడియాలో సినీ ప్రేక్షకులు.. నాగచైతన్యన్ని, శోభితనే ఒక లెవెల్ లో ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. సమంత ఒక దర్శకుడితో డేటింగ్ చేస్తోంది అనే వార్త అందరిని షాక్ గురిచేస్తోంది. కొన్ని నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. సమంత ఫ్యామిలీ మాన్ దర్శకుడు రాజ్ తో.. డేటింగ్ చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దర్శకుడితో గతంలో ఫ్యామిలీ మ్యాన్ లో నటించిన సమంత.. ఇప్పుడు సిటాడెల్ నటిస్తోంది.
వీరిద్దరూ ఫ్లైట్లో తీసుకున్న కొన్ని ఫోటోలు కూడా.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై సమంత.. లేదా ఈ దర్శకుడు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. మరోపక్క నాగచైతన్య ఎంగేజ్మెంట్ గురించి కూడా సమంత.. ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు.