SBI CBO Recruitment : ఎస్బీఐ సీబీఓ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ, అర్హతలు.. ఎంపిక ప్రక్రియ..పూర్తి వివరాలు

Mon, 27 Dec 2021-11:46 pm,

SBI CBO Recruitment 2021: SBI jobs application last date, eligibility, salary, age limit details : దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉండే ఎస్బీఐ బ్యాంకు పరిధిలోని ఐదు సర్కిల్స్‌లలో.. 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (SBI CBO Recruitment 2021) పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఎస్బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (Circle Based Officers) (SBI CBO) నోటిఫికేషన్‌ వివరాలు.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ విధానం గురించి పూర్తి వివరాలు.. 

ఎస్బీఐ సీబీఓ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ సాగుతుంది. ఆన్‌లైన్‌ విధానంలో సీబీఓ (SBI CBO) ఆఫీసర్‌ పోస్టుల రాత పరీక్ష ఉంటుంది. మొత్తం నాలుగు విభాగాల్లో 120 మార్కులకు ఈ రాత పరీక్ష ఉంటుంది. పరీక్షకు రెండు గంటల సమయం గడువు ఉంటుంది.  

ఎస్బీఐ సీబీవో.. మొత్తం పోస్ట్‌ల సంఖ్య.. 1226. ప్రారంభ వేతనం రూ.36,100గా ఉంటుంది. మొత్తం వేతన శ్రేణులు ఈ విధంగా ఉన్నాయి. రూ.36000-1490/7-46430-1740/2- 49910-1990/7-63840. 

ఎస్బీఐ సీబీవో పోస్టులకు అర్హత.. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.అలాగే డిసెంబర్‌ 1, 2021 నాటికి ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లేదంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లో కనీసం రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టులకు వయసు.. డిసెంబర్‌ 1, 2021 నాటికి 21 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఇక రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు ఇందులో సడలింపు లభిస్తుంది. 

సీబీఓ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 29, 2021.  ఆన్‌లైన్ లో ఫీజు చెల్లించేందుకు గడువు - డిసెంబర్ 9 2021 నుంచి డిసెంబర్ 26, 2021 వరకు. దరఖాస్తులను ఎడిట్ చేసుకోవడానికి చివరి తేదీ- డిసెంబర్ 29, 2021. ఆన్‌లైన్ దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- జనవరి 13, 2022. SBI CBO అడ్మిట్ కార్డ్ - జనవరి 12, 2022 నుంచి (తాత్కాలికంగా). SBI CBO పరీక్ష తేదీ - త్వరలో ప్రకటిస్తారు.

ఎంపిక ప్రక్రియల్లో అన్నింటిలో విజయం సాధిస్తే.. ముందుగా ఆరు నెలల ప్రొబేషన్‌ ఉంటుంది. తర్వాత జూనియర్‌ మేనేజ్‌మెంట్ గ్రేడ్‌ స్కేల్‌ – 1 హోదా కల్పిస్తారు. అనంతరం చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link