SBI Home Loans: ఎస్బీఐ హోమ్ లోన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్
Good News for SBI Home Loan Applicants: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకునే వారికి హోమ్ లోన్ తో పాటే ఇంకొన్ని ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయి. అందులో ఒకటి సోలార్ రూఫ్ టాప్ ఫైనాన్స్. అవును, ఎస్బీఐలో హోమ్ లోన్ తీసుకునే వారికి సోలార్ రూఫ్ టాప్ ఫైనాన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
Solar Roof Top for SBI Home Loan Applicants: ఇటీవల కాలంలో సోలార్ విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. పైగా ఇంటి అవసరాలకు మించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకున్న వారు స్థానిక విద్యుత్ సరఫరా సంస్థకు విద్యుత్ ని కూడా అమ్ముకునే వెసులుబాటు ఉండటంతో ఇదొక ఆదాయ వనరుగా భావించే వాళ్లు లేకపోలేదు.
Good News for SBI Home Loans Applicants: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైయప్ అయిన ప్రాజెక్టుల్లో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం 5 రోజుల్లోనేహోమ్ లోన్ మంజూరు కానుంది. ప్రాసెసింగ్, వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేయకుండా త్వరితగతిన లోన్ మంజూరయ్యేలా ఎస్బీఐ సహాయపడుతుంది.
SBI Home Loans Top-up Loans: హోమ్ లోన్ తీసుకున్న తరువాతి కాలంలో ఎదురయ్యే ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎక్స్‌ట్రా టాప్ అప్‌లోన్ కూడా అందివ్వనున్నారు. అది కూడా తక్కువ వడ్డీ రేటుకే ఈ టాపప్ లోన్ లభించనుంది.
SBI Home Loans Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేటు 8.50 శాతం నుంచి ప్రారంభం కానుంది. ఇతర బ్యాంక్స్ అందిస్తున్న హోమ్ లోన్స్ వడ్డీ రేట్లతో పోల్చుకుంటే ఎస్బీఐ హోమ్ లోన్స్ వడ్డీ రేటే తక్కువ కావడం గమనార్హం.