Scheme: ఈ స్కీమ్‌లో డబ్బులు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే.. 7.90 శాతం వడ్డీ, పూర్తి వివరాలు ఇవే..
ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఎక్కువ శాతం వడ్డీ అందించే పథకాలను చూస్తారు. పోస్టాఫీస్, బ్యాంకు ఎఫ్‌డీలో ఎటువంటి రిస్క్ లేకుండా రాబడి ఉంటుంది. అందుకే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాలని మీరు అనుకుంటున్నారా?
ఎస్‌బీఐ సర్వోత్తమ్ ఫిక్సెడ్ డిపాజిట్ అత్యంత తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ, ఇతర స్కీమ్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో సీనియర్ సిటిజెన్లు ప్రతి ఒక్కరూ ఇందులో డబ్బులు దాచి ఉంచకూడదు.
ఈ సర్వోత్తమ్ స్కీమ్‌లో ఎస్‌బీఐ 7.4 శాతం వడ్డీ సాధారణ కస్టమర్లకు అందిస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 50 బేసిస్ పాయింట్స్ అదనంగా అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వారికి 7.90 శాతం వడ్డీ అందిస్తోంది.ఈ ఖాతాను ఎవరైనా తెరవచ్చు.
ఈ స్కీమ్‌లో మీరు రూ.15.01 పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ.2 కోట్లు కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఎస్‌బీఐ తన సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.10 అందిస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం అందిస్తోంది.
ఈ పథకం రిటైర్డ్ అయిన వారికి బాగా ఉపయోగపడుతుంది. పీపీఎఫ్ డబ్బులు చేతికి రాగానే ఈ పథకంలో డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు. ఎస్‌బీఐలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడ్డి పెట్టొచ్చు.