Stock market crashes:స్టాక్ మార్కెట్లలో రక్త పాతం...రూ. 10 లక్షల కోట్ల సొమ్ము ఆవిరి..కారణాలు ఇవే..!!

Mon, 05 Aug 2024-12:55 pm,

Stock market crashes at opening:స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఏకంగా స్టాక్ మార్కెట్లలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల  మార్కెట్ క్యాప్ నష్టపోయింది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లలో  అతిపెద్ద పతనంగా  నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు సెన్సెక్స్ 3 శాతం భారీ పతనంతో ప్రారంభం కాగా, నిఫ్టీ కూడా 2 శాతం నష్టంతో ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న నష్టాలతో అటు దేశీయ మార్కెట్లు వరుసగా పతనం అవుతున్నాయి.   

సెన్సెక్స్ ఈరోజు 2400 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద ప్రారంభం అవగా, నిఫ్టీ 415 పాయింట్ల నష్టంతో 24,302 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 764 పాయింట్ల నష్టంతో 50,586 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన తర్వాత, రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే నాటికి  మార్కెట్‌లోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 45,764,272.12గా ఉండగా, ఇది ఇప్పుడు రూ.4,47,41,730.94కి తగ్గింది. కరెన్సీ మార్కెట్‌లో కూడా, రూపాయి విలువ డాలర్ కు ప్రతిగా రికార్డు కనిష్ట స్థాయి 83.80 రూపాయలకు పడిపోయింది.   

అమెరికాలో ఆర్థిక మాంద్యం: అమెరికాలో మాంద్యం భయంతో మార్కెట్‌లో బలహీనత ఏర్పడింది. బలహీనమైన ఆర్థిక డేటా కారణంగా ఇప్పుడు మాంద్యం భయం ఉంది. ప్రధానంగా జాబ్స్ డేటా కూడా ఊహించిన దాని కంటే బలహీనంగా ఉంది. అమెరికాలో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్టానికి చేరుకొని,  నిరుద్యోగం రేటు 4.3%కి పెరిగింది. జూలైలో, ఇది 4.1 శాతం అంచనాతో పోలిస్తే 4.3 శాతానికి పెరిగింది. కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా అంచనా కంటే తక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో దీంతో అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం గతవారం డౌ జోన్స్ 600 పాయింట్లు, నాస్‌డాక్ 425 పాయింట్లు పడిపోయాయి.   

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కూడా అమెరికా మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్‌పై దాడి చేయవద్దని అమెరికా హెచ్చరించింది.  అంతర్జాతీయంగా నెలకొన్న ఈ అనిశ్చితి కూడా  దేశీయ మార్కెట్లను కలవరానికి గురిచేస్తుంది.

అమెరికా మార్కట్లలో ఫలితాల బేజారు : అమెరికాలోని మేజర్ కంపెనీల క్వార్టర్ ఫలితాలు కూడా మార్కెట్లకు సపోర్ట్ చేయడం లేదు. అమెజాన్,  ఇంటెల్ వంటి దిగ్గజ కంపెనీల ఫలితాలు నిరాశపరిచాయి.ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ Appleలో తన వాటాలో 50% విక్రయించారు. ఇది మార్కెట్‌ పతనానికి పెద్ద ట్రిగ్గర్ కింది మారింది.    

బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీలో మార్పు: బ్యాంక్ ఆఫ్ జపాన్ తన బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను పెంచడంతో US డాలర్‌తో పోలిస్తే జపనీస్ యెన్ విలువ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే జపాన్ యెన్ 7 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది భారీ గ్లోబల్ సెల్లింగ్‌కు దారితీస్తుందని మార్కెట్ ఆందోళన చెందుతోంది.  

ఆర్థిక మాంద్యం భయం కారణంగా, ముడి చమురు శుక్రవారం 3.5 శాతం పడిపోయింది  77 డాలర్ల దిగువకు పడిపోయింది, ఇది 7 నెలల కనిష్ట స్థాయి కావడం విశేషం. అమెరికాలో 10-సంవత్సరాల బాండ్ యీల్డ్ సంవత్సరంలో మొదటిసారిగా 3.8 శాతానికి పడిపోయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link