Bigg Boss: బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం.. 20 అడుగుల ఎత్తున నుంచి కిందపడిన కార్మికుడు

Wed, 25 Sep 2024-7:27 pm,

బిగ్‌బాస్‌ సెట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని చెంబరంబాక్కం ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో బిగ్‌బాస్‌ సెట్‌ వేస్తున్నారు.

త్వరలో 8వ బిగ్‌బాస్‌ సీజన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్‌ ఏర్పాటు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

సెట్‌ పనిలో నిమగ్నమైన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. అతడు మహ్మద్‌ షాహీన్‌ ఖాన్‌ 

అతడి కాలు, చేతులు విరిగిపోయాయని.. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

తమిళ బిగ్‌బాస్‌కు ఇటీవల కమల్‌ హాసన్‌ బై బై చెప్పేయడంతో విజయ్‌ సేతుపతి హోస్ట్‌ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయి వారిని తమ నియంత్రణలోకి తీసుకున్నారని సమాచారం. ఈ సీజన్‌ అక్టోబర్‌ 6వ తేదీన ప్రారంభం కానుంది.

ఈసారి భారీ ఎత్తున కంటెస్టెంట్లు ఉంటారని తమిళంలోనే బిగ్గెస్ట్‌ సీజన్‌గా ఇది నిలుస్తుందని ట్రేడింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link