Shraddha Das: అజంతా శిల్పాన్ని మరిపిస్తోన్న శ్రద్ధా దాస్ అందాల సోయగం.. చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Thu, 14 Mar 2024-4:06 pm,

శ్రద్ధా దాస్ తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. యాక్టింగ్ కంటే తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేసింది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తాజాగా అజంతా శిల్పంలా కనిపిస్తూ అభిమానులను కనువిందు చేసింది. 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాత ఈ భామకు అవకాశాలు వరుస వచ్చినా.. స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. 

శ్రద్ధా దాస్ కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి సినిమాల్లో నటించింది. 

ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది శ్రద్ధా దాస్. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది. 

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం ఖాకీ బిహార్ ఛాప్టర్‌ వెబ్ సిరీస్‌లో శ్రద్ధా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించి అలరించింది శ్ర‌ద్ధా దాస్. 

తెలుగులో ముఖ్యంగా ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించినా.. శ్రద్దా దాస్ కెరీర్‌కు ఈ సినిమాలు పెద్దగా యూజ్ కాలేదనే చెప్పాలి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link