Skanda Sashti 2024: పెళ్లి అస్సలు కుదరట్లేదా.. సుబ్రహ్మాణ్యుడి ఆలయంలో ఇలా చేయండి.. ఇంట్లో పెళ్లి బాజాలే..

Fri, 15 Mar 2024-11:40 am,

సుబ్రహ్మాణ్య షష్థితిథిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈరోజున ముఖ్యంగా చాలా మంది ఉదయాన్నే ఆలయాలకు వెళ్తుంటారు. ఈసారి ఈ పండుగ శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజున పెళ్లికానీ వారు కొన్ని పరిహారాలు పాటిస్తే వెంటనే పెళ్లి కుదురుతుందని పండితులు చెబుతుంటారు. 

మనలో చాలా మంది కాలసర్ప దోషంతో బాధపడుతుంటారు. ఈ దోషాలు ఉన్నవారికి పెళ్లిళ్లు కుదరవు. ఉద్యోగం దొరకదు. ఉద్యోగంలో గ్రోత్ ఉండదు. అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు.  అదే విధంగా ఈ దోషం ఉన్నవారికి పిల్లలు కూడా పుట్టరు. 

నాగదోష నివారణకు, సంతానలేమి నుంచి బైటపడటానికి జంటనాగులను ఆరాధించాలి. పుట్టదగ్గరకు వెళ్లి జంటనాగులను పూజించాలి. పాలతో అభిషేకించాలి. కుంకుమలతో, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించాలి. ఇలా చేస్తే వెంటనే పెళ్లికుదురుతుంది. పోయిన వారి దోషాలు కూడా ఉంటే ఉపశమనం లభిస్తుంది.  

స్కందషష్టి రోజున పుట్టకు ఐదు పొరల తెలుపు దారం చుట్టాలి. ఇలా ఒక ఐదు శుక్రవారాలు లేదా ఐదు మంగళవారాలు ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇలా చేస్తే నాగదేవత అనుగ్రహం కల్గుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.  పుట్టదగ్గర నల్లని చీమలు ఉంటాయి. అక్కడ చక్కెర సమర్పించాలి.

ముఖ్యంగా కెరిర్ లో గ్రోత్ లేని వారు ప్రతిరోజు రావి చెట్టు అడుగున నల్లటి చీమలకు చక్కెరను వేయాలి. ఇలా వేస్తే మన జీతింలో దోషాలు పోతాయంటారు. అదే విధంగా వల్లీ దేవసేనల వివాహం జరిపించాలి. ఇలా చేయిస్తే పెళ్లి కుదరడంలో ఉన్న ఆటంకాలు ఏవైన ఉంటే అవి తగ్గిపోతాయి.   

సాధారణంగా మనలో కొందరు పాములు కన్పిస్తే, వెంటనే చంపేయడం చేస్తారు. కానీ అలా చేయంకుండా స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇవ్వాలి. పాములను అకారణంగా చంపడం వల్ల కాలసర్పదోషం ఏర్పడుతుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link