Snake Revenge: పాములు పగబడతాయంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే?
ఇప్పటికే చాలా మందికి పాములపై అనేక ప్రశ్నలు ఉన్నాయి. నిజంగా పాములు పగబడతాయా? పగబట్టిన పములు చంపుతాయా? అని దీనిపై ఉన్న ఆపోహలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సైటిఫిక్‌గా చూస్తే పాములకు జ్ఞాపకశక్తి ఎంతో తక్కువగా కూడా ఉంటుంది. అంతేకాకుండా అవి చెవులను కూడా కలిగి ఉండవు. కానీ చాలా మంది ఇవి పగబడతాయని నమ్మతారు. ఇందులో నిజమెంతా?
మిగితా జీవుల్లాగే పాములు కూడా సాధరణ జీవితం గడుపుతాయి. ఆహారం కోసం ఇతర చిన్న చిన్న జంతువులు, పక్షులపై దాడి చేయడం, వాటిని చంపడం చేస్తూ ఉంటాయి.
ఇటీవలే పరిశోధనల్లో తేలియ విషయం ఏమిటంటే పాములు ఆహారం కోసం వెతికే క్రమంలో వాటిని నుంచి వచ్చే వాసను గుర్తు పెట్టుకుంటాయట. కానీ ఆ జీవికి సంబంధించిన రూపాన్ని మాత్రం గుర్తు పెట్టుకునే ప్రసక్తి లేదని పరిశోధనల్లో వెళ్లడైంది.
అంతేకాదు పాములు అవి పెట్టుకున్న పుట్టులోనుంచి బయటకు ఆహారం కోసం వచ్చినప్పుడు.. మళ్లీ తిరిగి ఆ పుట్టులోకి వెళ్లేందుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తాయట. అంతేకాకుండా తక్కువ జ్ఞాపక శక్తి వల్ల సొంత పుట్టులను మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది.
అలాగే పాములు ఎప్పుడు మనుషులపై దాడీ చేయాలని చూడవట.. అవి కేవలం ఆహారంగా భావించి మాత్రమే దాడి చేస్తాయని సమాచారం. దీంతో పాటు ఒక వ్యక్తిపై పదే పదే దాడి చేయడం కూడా యాధృచ్ఛికమేని నిపుణులు తెలుపుతున్నారు.
పాములు మనుషులు, ఇతర జంతువులపై దాడి చేసేందుకు ఆసక్తిగా ఉండవట.. కానీ వాటికి దగ్గరగా వస్తున్నప్పుడు, ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే దాడి చేస్తాయట.
అలాగే పాములు వాటికి ఎక్కువగా ప్రమాదం కలుగుతుందనే భావన కలిగినప్పుడే.. రక్షణ కోసం కాటు వేయడం, బుసలు కొట్టడం చేస్తూ ఉంటాయి.. తప్ప పాములు పగబట్టవని పరిశోధనల్లో తెలింది.