Sobhita Naga Chaitanya: శోభిత నాగచైతన్యల న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ఎక్కడో తెలుసా?
అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య పెళ్లి శోభిత ధూళిపాళతో ఈ ఏడాది డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్లిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒకటయ్యారు. సంప్రదాయ పద్ధతిలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరిగింది.
చైతన్య 'తండేల్' సినిమా త్వరలో విడుదల కానుంది. సంక్రాంతికి కొన్ని బడా సినిమాలు ఉండటంతో ఫిబ్రవరి లేదా మార్చిలలో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు మరోసారి సాయి పల్లవి జతకట్టింది. చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ సినిమాపై నాగచైతన్య భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆయన డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపిస్తున్నారు.
నాగచైతన్య సమంత ప్రేమించి మొదట పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నారు. శోభిత తెలుగు అమ్మాయి గుంటూరు జిల్లాకు చెందినవారు.
అయితే నాగచైతన్య శోభిత ధూళిపాళల పెళ్లి సమయంలోనే సమంతకు మరో బిగ్ షాక్ తగిలింది. సమంత నాన్నగారు కూడా గుండెపోటుతో మరణించారు.
ఇక సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాలో బిజీ అయిపోయింది. ఆ తర్వాత సామ్ మాయోసైటీస్‌తో కూడా బాధపడింది. అయితే రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ 'సీటాడెల్- హనీ బనీ'లో ఆమె అలరించారు. బాలీవుడ్ సినిమాలో దూసుకుపోతున్నారు.
ఇక పెళ్లయిన తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళలు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. వారితోపాటు నాగార్జున కూడా కనిపించారు. అయితే ఈ కొత్తజంట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోబోతుందా? అని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళు ముంబైలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నట్లు సమాచారం.