Sobhita Wedding: చైతు, శోభితల పెళ్లి.. ఆ రూమర్స్‌పై సీరియస్ అయిన అక్కినేని నాగార్జున..?
అక్కినేని నాగచైతన్య, శొభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4 వ తేదీన జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే దీని కోసం అన్నిరకాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న పూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వర రావు విగ్రహాం ముందు.. వీరి పెళ్లి జరుగనుందని తెలుస్తొంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైతు, శోభితల పెళ్లిపై అనేక రూమర్స్ తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, వీరి పెళ్లికి సంబంధించిన వేడుకను స్ట్రీమింగ్ కోసం.. ఓటీటీ కి ఇచ్చినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
దీనిపై ప్రస్తుతం.. శొభిత కూడా నయన తార బాటలోనే .. తన పెళ్లి వేడుకను స్ట్రీమింగ్ ఇచ్చారని ప్రచారం కూడా జరిగింది. రీసెంట్ గా నయనతార, హన్సిక పెళ్లి కూడా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో.. చైతు, శొభితలు సైతం.. తమ పెళ్లిని ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయని వార్తలువచ్చాయి. ఈ క్రమంలో దీనిపై తాజాగా, అక్కినేని నాగార్జున పాటు... ఆయన టీమ్ రియాక్ట్ అయినట్లు తెలుస్తొంది. చైతు శోభితల పెళ్లి స్ట్రీమింగ్ లపై వస్తున్న రూమర్స్ ను ఖండించినట్లు సమాచారం
ఇలాంటి పనులు చేయడం మానుకొవాలని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు వీరి పెళ్లి అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్యలో.. డిసెంబర్ 4న జరుగనుందని తెలుస్తొంది. దీంతో వీరి పెళ్లి స్ట్రీమింగ్ లపై వస్తున్న వార్తలకు మాత్రం చెక్ పెట్టినట్లు తెలుస్తొంది.
అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీల ఎంగెజ్ కు చెందిన పిక్స్ నిన్న సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అక్కినేని ఫ్యామిలీ ఇంట వరుస శుభకార్యాలు జరుగుతుండటంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తొంది.