Sobhita Dhulipala Assets: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
Sobitha Dhulipala Akkineni Assets:శోభితా ధూళిపాళ్ల అనేకంటే శోభితా అక్కినేని అయింది. ఈమె తెలుగు సహా వివిధ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనుసు దోచుకుంది. అంతేకాదు పెళ్లికి ముందుకు వరకు తన హాట్ ఫోటో షూట్‌లతో వార్తల్లో నిలిచింది.
తాజాగా ఈమె అక్కినేని ఇంటి కోడలు అయిన సందర్బంగా ఈమెకు ఆస్తులకు సంబంధించిన వార్తలు మరోసారి వార్తల్లో నిలిచింది. వీరి పెళ్లి అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది.
నాగ చైతన్య, శోభితల పెళ్లికి కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది మాత్రమే అటెండ్ అయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో వీరి పెళ్లికి సంబంధించిన తంతు స్ట్రీమింగ్ కు రానుంది.
శోభితా .. అచ్చ తెలుగందం.. ముందుగా ఈమె తెలుగులో కాకుండా హిందీలో తెరకెక్కిన 'రమన్ రాఘవ్ 2.O' చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన శోభిత కెరీర్.. ఆ తర్వాత తెలుగు, తమిళం,మలయాళంలో హీరోయిన్ గా తన లక్ పరీక్షించుకుంటుంది శోభితా.
31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో వేణు గోపాల్ రావు, శాంతి కామాక్షి దంపతులకు జన్మించిన శోభితా దూళిపాల.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. ఆమె తండ్రి వృత్తి రీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ల కుటుంబం విశాఖ, ముంబై సహా పలు ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ కావడంతో ఈమెకు వివిధ భాషల్లో పట్టు ఏర్పడింది.
ఈమెకు తన సినిమాలు పేరేంట్స్ ద్వారా రూ. 35 కోట్ల వరకు ఆస్తులున్నాయట. మరోవైపు అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత నాగ చైతన్య, నాగార్జున ఆమె పేరు మీద కొన్ని ఆస్తులు.. నగలు సహా కొంత ముట్టజెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం అత్తంటి వారి ఆస్తులు కలిపి ఈమెకు రూ. 100 కోట్ల వరకు ఉంటుందనేది సమాచారం.