Bad luck animals: ఈ జంతువులు ఇంట్లో ఉంటే దరిద్రానికి గ్రీన్ కార్పేట్ వేసినట్లే.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Tue, 28 May 2024-6:23 pm,

కొందరు తమ  ఇళ్లతో నల్ల పిల్లులను పెంచుకుంటారు. కానీ నల్ల పిల్లులు చెడు స్వభావం కల్గి ఉంటాయంటారు. ఇవి ఇంట్లోని పాలు తాగేవారు ఉండొద్దని, పాలంతా తనకు దొరకాలని కోరుకుంటుందంట. బైటకు వెళ్లినప్పుడు చాలా  మంది పిల్లి ఎదురైతే పనికాదని, మరల రిటర్న్ వచ్చేస్తుంటారు.

ఇంటి పరిసరాల్లో కప్పలు ఉండకుండా చూసుకొవాలి. కప్పలు కూడా దరిద్రాన్ని తీసుకొని వస్తుంటాయంట. అందుకు కప్పలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉన్న చెట్లలో లేకుండా చూసుకొవాలి.

ఈ మధ్యకాలంలో కొందరు  పాముల్ని తమతో పాటుగా పెంచుకుంటున్నారు. కానీ దీని వల్ల కూడా కొన్నిసార్లు లేని ఇబ్బందులు, ప్రాణాలు పోయే ఘటనలు కూడా కల్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పాములు, కొండ చిలువల్ని అస్సలు ఇంట్లో పెంచకూడదు.

కాకులలో ఆత్మలు ఉంటాయని చెబుతుంటారు. కాకి ఇంటి మీద వాలి కావ్ .. కావ్ అని అరిస్తే ఏదో ఒక రాబోయే అనర్థానికి మూలమని చెబుతుంటారు. అందుకే కాకిని ఇంటి చుట్టుపక్కల కూడా వాలనీయకుండా జాగ్రత్తపడాలి.

చెట్లల్లో గుడ్లగూబలు వాలుతుంటాయి. ఇవి రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుంటారు. వీటి అరుపులు కూడా భయంకరంగా ఉంటాయి. వీటిని చూడటం కూడా ఒకరకమైన నెగెటివ్ ఫలితాలు ఇస్తుందని చెబుతుంటారు.

గబ్బిలాలు ముఖ్యంగా  రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తుంటాయి. అందుకు రాత్రిళ్లు ఇంట్లో గబ్బిలాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.. పొరపాటున ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకొవాలి.

కొందరు బల్లులు, తొండలను కూడా  పెంచుకుంటారు. కానీ జ్యోతిష్యుల ప్రకారం తొండలను కూడా మన ఇంటికి చెడుచేస్తాయని, చెడు ఫలితాలు కల్గజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link