Bigg Boss 8 Telugu: కరీంనగర్‌ పిల్ల సోనియా ఆస్తుల విలువ అన్ని కోట్లా..? ఈ ఆర్జీవీ భామ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

Sun, 22 Sep 2024-1:01 pm,

మొదటి రోజు నుంచి హౌస్ లో బాగా రచ్చ చేయడం సోనియా ఆకులకు అలవాటుగా మారింది హౌస్ ఉంటే ఏమైనా త్వరగా పంపించాలని చాలామంది అనుకున్నారు. కానీ బిగ్ బాస్ దీనికి విరుద్ధంగా చేస్తారు కాదా.. అసలు సోనియా ఆకుల పెద్దపల్లి మంథనికి చెందినవారు. ఈ బ్యూటీ తండ్రి ఆకుల చక్రపాణి తల్లి, మల్లీశ్వరి వీరిది మధ్యతరగతి కుటుంబం.  

సోనియాకు ఇద్దరు అన్నలు ఉన్నారు ఆమె 9వ తరగతి వరకు మంథనీలో చదివారు పదో తరగతి హనుమకొండలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆ భోజ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చేశారు అయితే  చివరికి ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేసింది కానీ ప్రాక్టీస్ చేయలేదు. పబ్లిక్ పూర్తి డిపార్ట్మెంట్స్ లో కూడా ఉద్యోగం చేసింది. ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ గా కూడా పనిచేశారు.  

కానీ ఈమె చిన్ననాటి కల అయినా నటనను ఎంచుకుంది. చూడటానికి అందంగా ఉండటంతో చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చాలా చురుగ్గా కూడా ఉంటుంది కాబట్టి దీనిపై దృష్టి పెట్టింది. సినీవారం ద్వారా ఆ అవకాశం దొరికింది. కొన్ని బతుకమ్మ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ వంటివి చేసింది ఆ తర్వాత జార్జి రెడ్డి లో సినిమాలో కూడా ఈమెకు అవకాశం దొరికింది జార్జి రెడ్డి చెల్లి పాత్రలో నటించి మెప్పించారు.  

దీంతో సోనియా నటనకు ఫిదా అయినా ఆర్జీవి కోవిడ్ వైరస్ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆ తర్వాత ఆశ ఎన్‌కౌంటర్ మూవీ లో కూడా నటించారు. అలా సోనియాకు ఆర్జీవీతో అనుబంధం పెరిగింది ఇక ఆర్జీవి ఫిగర్ అనే ట్యాగ్ పడటంతో ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి. ఆయన తన సినిమాలో నటించిన వారితో క్లోజ్ గా ఉంటారు అంతే అని చెప్పింది.  

ఆ తర్వాత ఆశా ఫౌండేషన్ ని కూడా స్టార్ట్ చేశారు. పేద పిల్లలకు ఆర్థిక సహాయం 'ప్రేరణ' పేరుతో అమ్మాయిలకు మంచి చదువు అందించాలని కార్యక్రమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.   

అయితే ఓ ఎన్జీఓతో తను ప్రేమలో పడ్డాట్లు హౌస్‌లో చెప్పింది. తాను నడిపిస్తున్న ఫౌండేషన్‌కు ఆయన అమెరికా నుంచి డోనర్‌ అని కూడా అన్నారు. ఆయనకు ఉన్న డిపెడెన్సీ వల్ల కొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు అన్నారు.  

ఇక బిగ్‌ బాస్‌ 8 నామినేషన్ సమయంలో బాగా ఇచ్చి పడేస్తున్న సోనియా. సోషల్ మీడియాలో చాలామంది ట్రోస్ చేస్తూ హౌస్ నుంచి బయటికి పంపించేయాలని కామెంట్స్ పెడుతున్నారు. నిఖిల్‌, పృథ్వీలతో సన్నిహితంగా ప్రవర్తిస్తూనే మరోవైపు వాళ్ళు బ్రదర్స్ తో సమానమని బాంబు పేల్చింది.  

అయితే, సోనియా ఆకులకు కోటీ వరకు ఆస్తులు ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8 లోకి అడుగుపెట్టిన ఈమెకు రోజుకు రూ.5 వేలు రెమ్యూనరేషన్‌ చెల్లిస్తున్నారట.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link