10 Babies Born At once: ఒకే కాన్పులో 10 మంది శిశువులు జననం, Guinness World Record

Wed, 09 Jun 2021-1:09 pm,

10 Babies In One Delivery : ఒక కాన్పులో ముగ్గురు, నలుగురు చిన్నారులు జన్మిస్తేనే ఆశ్చర్యపోతుంటాం. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది చిన్నారులకు జన్మనిచ్చింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 9 చిన్నారుల రికార్డును దక్షిణాఫ్రికా మహిళ తిరగరాశారు. దీంతో ఒకే కాన్పుతో వీరు పది రెట్ల ఆనందంతో ఉన్నారని మీడియాకు తెలిపారు. (Photo Source: Mirror)

గత నెలలో మొరాకోకు చెందిన మాలియన్ హలీమా సిస్సే ఒకే కాన్పులో 9 మంది చిన్నారులకు జన్మనిచ్చింది. జూన్ 8న దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామె థామర సిథోల్ (37) ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చి గిన్నిస్ రికార్డు తన పేరిట లిఖించుకుంది. ప్రిటోరియాలోని ఓ ఆసుపత్రిలో తాను ఒకే కాన్పులో పది మంది చిన్నారులకు జన్మనిచ్చానని ప్రకటించింది. (Photo Source: Mirror)

10 మంది శిశువులలో ఏడుగురు మగ పిల్లలు కాగా, ముగ్గురు ఆడ శిశువులున్నారు. తమకు ఇదివరకే ఆరేళ్ల కవలలు ఉన్నారని థామర సిథోల్ భర్త టెబోహో సోటెట్సీ తెలిపారు. తన భార్య సహజంగానే గర్భం దాల్చిందని, అందుకోసం ఎలాంటి వైద్య చికిత్స తీసుకోలేదని చెప్పారు. చిన్నారులు తల్లి గర్భం దాల్చిన తరువాత 29వ నెలలో జన్మించారని సోటెట్సీ వెల్లడించాడు. (Photo Source: Mirror)

శిశువులు 8వ నెలలో జన్మించారని, వీరిని నెల రోజులకు పైగా ఇంక్యుబేటర్‌లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. గత నెలలో 9 మంది చిన్నారులు జన్మించగా, అందరూ క్షేమంగా ఉన్నారు. తమ శిశువులు కూడా ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారని గొసియామె థామర సిథోల్, టెబోహో సోటెట్సీ ఆకాంక్షించారు.  (Photo Source: Mirror)

కొందరు డాక్టర్లు స్కాన్ చేసి 6 చిన్నారులు పుడతారని చెప్పగా, మరికొందరు డాక్టర్లు 8 మంది వరకు జన్మిస్తారని తమకు చెప్పగా, చివరగా 10 మంది శిశువులకు తాను జన్మనిచ్చానని దక్షిణాఫ్రికా మహిళ గొసియామె థామర సిథోల్ వెల్లడించారు. (Photo Source: Mirror)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link