Sreeleela: వైట్ డ్రెస్ లో ప్రిన్సెస్ లా శ్రీలీల.. ప్రేమలో పడేస్తున్న ఫోటోలు

Thu, 27 Jun 2024-7:38 am,

తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల కి ప్రత్యేక స్థానం ఉంది. మొదటి సినిమా విడుదల కాగానే.. తొమ్మిది వరస అవకాశాలు అందుకున్న హీరోయిన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ హీరోయిన్. శ్రీకాంత్ కొడుకు రోషన్ తో శ్రీలీల నటించిన మొదటి చిత్రం పెళ్ళిసందరి బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకుంది.

అయితే ఆ తర్వాత రవితేజతో నటించిన ధమాకా చిత్రం మాత్రం ఆమెకు మంచి విజయం అందించింది. ముఖ్యంగా ధమాకా సినిమా కన్నా.. కూడా ఆ సినిమాలో శ్రీలీల డాన్స్, బ్యూటీ.. హైలెట్ గా నిలిచాయి. అప్పట్లో ఆ సినిమా శ్రీలీల వల్లే విజయం సాధించింది అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

ఇక అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది ఈ నటి. అయితే ఆ తరువాత నటించిన ఏ చిత్రం కూడా శ్రీ లీలాకి.. అంతగా విజయం తెచ్చిపెట్టలేదు. అయితే బాలకృష్ణతో నటించినా భగవంత్ కేసరి సినిమా మాత్రం.. ఈ హీరోయిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ చిత్రం మినహా శ్రీలీల కెరియర్ లో ఆ తరువాత పెద్దగా విజయాలు రాలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ హీరోయిన్. మరోపక్క హిందీలో.. వరసగా రెండు ఆఫర్లు అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. హిందీలోనే కాకుండా తమిళంలో కూడా శ్రీ లీల రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో శ్రీ లీల ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. వైట్ డ్రెస్ లో ప్రిన్సెస్ లా.. కనిపిస్తూ అందరిని ప్రేమలో పడేస్తోంది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link