Mokshagna: మోక్షజ్ఞ సరసన స్టార్ కిడ్.. తెరపై రచ్చరంబోలే..!

Fri, 25 Oct 2024-8:00 am,

ఇటీవల బోయపాటి దర్శకత్వంలో మూడు సినిమాలతో వరుసగా విజయాలు సాధించి, హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు అఖండ - 2 కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరొకవైపు బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.   

సెప్టెంబర్ ఆరవ తేదీన మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా చాలా గ్రాండ్ గా ప్రకటించారు.  హనుమాన్ సినిమాతో..పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందులో భాగంగానే హీరోయిన్ గా.. ఎవరు రాబోతున్నారు అంటూ కొంతమంది పేర్లు వినిపించగా.. ఫైనల్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కూతురిని.. ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

కేజీఎఫ్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సొంతం చేసుకున్న రవీనా టాండన్, అనిల్ తడాని కూతురు రాషా తడాని హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం . ఇటీవలే ఈమె లుక్ టెస్ట్ చేయగా ఆమె సక్సెస్ఫుల్ అయినట్టు తెలుస్తోంది.  

ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య డిసెంబర్ రెండవ తేదీన చాలా గ్రాండ్ గా లాంచ్  కానున్నట్లు సమాచారం. సోషియా ఫాంటసీ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కామియో రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలకృష్ణ తన కొడుకు సినిమా కోసం అన్ని దగ్గరుండి.. చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్ కూతుర్ని రంగంలోకి దింపడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link