Long Hair: మీ జుట్టు 5 అడుగుల పొడవు కావాలంటే ఈ 5 తినండి.. నెలలోనే బెస్ట్ రిజల్ట్స్
పొడవైన జుట్టు మీ సొంతం కావాలంటే ప్రోటీన్లు ,మాంసకృత్తులు విటమిన్ ఇ ఉండే ఆహారాలు తీసుకుంటే మీ జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మాంసాహారులైతే చేపలు, చికెన్ గుడ్లు తీసుకోవాలి. ఒక వేళ మీరు మాంసాహారులైతే పాలకూర, పుట్టగొడుగులు, పన్నీర్ వంటివి తీసుకుంటూ ఉండాలి.
ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా ఇనుములోపం ఏర్పడినప్పుడు జుట్టు బలహీనంగా మారటం మారుతుంది. దీంతో జుట్టు పెరుగుదల కుంటుపడుతుంది. ఎండు ఫలాలు , గుడ్డు, పాలకూర వంటివి తీసుకుంటు ఉండాలి.
బయోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే వేరుశనగ వెన్న పీనట్ బట్టర్ దొరుకుతుంది. అలాగే చేపలు, గుడ్లు తొందరగా పొడవుగా పెరగడానికి ఈ ఆహారాలు ముఖ్యం.
ఎండు ఫలాలు, గుడ్లు ,పాల కూర జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారాలు. ముఖ్యంగా ఇవి బయోటిన్ లోపం ఏర్పడకుండా చేస్తాయి. జుట్టు బలహీనంగా మారటం, తెగిపోవటం ఇలాంటి సమస్యలు ఉండవు. ఈ బయోటిన్ అనేది ప్రొటీన్లను విడగొట్టడానికి కారణమవుతుంది.
అలాగే విటమిన్ ఇ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది. బాదం గింజల్లో విటమిన్ ఇ ఉంఉటంది. వీటిని మీ డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె కలిపి బాదం నూనెను జుట్టుకు రాసుకొని అరగంట తర్వాత కడిగేసుకోవాలి.
విటమిన్ సీ ఉండే ఆహారాలు తినాలి. ముఖ్యంగా నిమ్మరసం, బత్తాయి, కమలపండు వంటి సీజనల్ పండ్లు కూడా మీ డైట్లో చేర్చుకోవాలి. ఇలా చేస్తే కూడా మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. ఆరోగ్యంగా బలంగా కూడా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )