Tamannaah Pics: దీపావళి కాంతిని ముందుగానే తీసుకువచ్చిన తమన్నా అందం
ఈ మధ్యనే "రా నువ్వు కావాలయ్యా" అంటూ జైలర్ సినిమా లోని పాట లో తన అందాలన్నీ ఆరబోసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా తన కైపెక్కించే ఫోటో లతో కుర్రకారు ను కవ్విస్తోంది.
ఇన్స్టా గ్రామ్ లో "మిఠాయి కి పటాఖా కి పిల్లలు పుడితే.. హ్యాపీ దీవాళీ" అంటూ తన అందమైన ఫోటోలు కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
పండగ సందర్భంగా చీరకట్టులో దర్శనమిచ్చిన తమన్నా బ్లూ శారీలో మెరుపులా కనిపించిది.
అప్పుడే భూలోకం లోకి దిగి వచ్చిన దేవ కన్యలాగా, దీపావళి కాంతులను తన ఒంటినిండా పులుముకున్నట్టు తన అందాలను ప్రదర్శించింది ఈ భామ.
షిమ్మరీ చీర లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అందరి మతి పోయేలాగా ఫ్యాన్స్ కి గ్లామర్ విందు చేసింది. ఈ ఫోటో లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.