Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!

Sat, 20 Apr 2024-12:13 am,

1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. విద్యార్థి నాయకుడి నుంచి 1970లో యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 1980లో మంత్రి పదవి దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిగా ప్రమోషన్ లభించడం విశేషం.

1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించగా.. ఆ టైమ్‌లో చంద్రబాబు కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి క్రమంగా పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగారు.  

1984 సంక్షోభ సమయంలో ఎన్టీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి ఎన్టీఆర్‌కు నీడలా నిలబడ్డారు.   

అయితే 1995లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ను దించేసి.. ఎమ్మెల్యేల మద్దతుతో తొలిసారి ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొందరు వెన్నుపోటు అని అంటే.. మరికొందరు పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు అలా చేయాల్సి వచ్చిందని సమర్థిస్తారు.  

1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో మరోసారి అధికారంలోకి వచ్చి.. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2003, 2009 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.  

రాష్ట్ర విభజన అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది.   

రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీయడంతో కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇక రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని అనుకున్నారు.  

కానీ చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో మళ్లీ పార్టీని రేసులోకి తీసుకువచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ధీటుగా ఎదుర్కొనేలా జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి తన ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link