Team India: రిషభ్ పంత్ స్థానంలో టీమ్ ఇండియాకు లభించిన కీపర్ కమ్ బ్యాటర్ ఎవరో తెలుసా
రిషభ్ పంత్ తిరిగి జట్టులో వచ్చేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. ఈలోగా కేఎల్ రాహుల్ రూపంలో జట్టుకు మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ లభించేసినట్టే.
2022 డిసెంబర్ నుంచి కేఎల్ రాహుల్‌కు 5వ నెంబర్ స్థానంలో ఆడే అవకాశం 7 సార్లు లభించింది. 56 సరాసరిన 280 పరుగులు సాధించాడు. అటు వన్డే ఫార్మట్‌లో 5వ నెంబర్‌లో బరిలో దిగిన అతడి ట్రాక్ రికార్డు ఇప్పటి వరకూ 17 మ్యాచ్‌లలో 1 సెంచరీ, 7 అర్ధ సెంచరీలున్నాయి.
కేఎల్ రాహుల్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్ విన్నింగ్ ఆట ప్రదర్శించాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 7 ఫోర్లు, 1 సిక్సర్ సాధించాడు. అటు వికెట్ కీపింగ్‌లో కూడా అద్భుమైన క్యాచ్ పట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన కన్పించింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా జట్టులో చేరి 5వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు.
రిషభ్ పంత్ జట్టుకు దూరం కావడంతో కేఎల్ రాహుల్ సరైన ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నాడు. వన్డే ఫార్మట్‌లో నెంబర్ 5 వ స్థానంలో కేఎల్ రాహుల్ సరైన ఫిట్‌గా కన్పిస్తున్నాడు.